ఈ మధ్యకాలంలో సినీ,  రాజకీయ నేతలపై సోషల్ మీడియా వేదికగా పలువురు అసభ్యకరమైన పోస్టులకు తెరలేపుతున్నారు. ఇవి కాస్త క్షణాల్లో వైౌరల్ అవుతున్నాయి.  ఓ వైపు సైబర్ పోలీసులు ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొంత మంది చేస్తున్న చిల్లర పనుల వల్ల సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతున్నారు.  ఇటీవల ఏపీలో కూడా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు పలువురు మహిళా నేతలపై కూడా ఫేస్ బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. తాజాగా తెలంగాణా గవర్నర్‌, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన తమిళ సహాయ నటుడు సాధిక్ భాషాను పోలీసులు అరెస్డ్ చేశారు.

 

తిరువారూరు జిల్లా, మన్నార్‌గుడి, అరిసికడై వీధికి చెందిన సాధిక్‌ (39) గతంలో 'కలవాణి–2'  చిత్రాల్లో నటించాడు.  ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో సాదిక్ భాష నటిస్తున్నాడు.  అతడు అసభ్యకరమైన పోస్ట్ చేసింది సామాన్య వ్యక్తికి కాదు.. ఆమె తెలంగాణ గవర్నర్ తమిళిసై కావడంతో విషయం కాస్త సీరియస్ అయ్యింది.  ఆమె మనోభావాలు దెబ్బ తినేలా  పరువుకు నష్టం కలిగించే విధంగా పోస్టులు చేసిన సాదిక్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని  స్థానిక బీజేపి నేత రఘురామన్‌, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తుండగా, తిరుత్తురైపూండి సమీపంలోని కట్టిమేడులో అతను చిక్కాడు.

 

తన అత్తగారింట్లో ఉన్న సాధిక్‌ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనుచిత పోస్టులు చేస్తే.. కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారిని వదిలేది లేదంటున్నారు.  ఈ మద్య కొంత మంది సైబర్ నేరగాళ్లు  ప్రముఖులు ఫేస్ బుక్ అకౌంట్స్ హ్యాక్ చేసి ఇలాంటి పోస్టు పెడుతున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: