ఈ నెలాఖరి వరకు మన తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు మూత పడటంతో పరిస్థితులు చక్కబడి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 2న విడుదలకాబోతున్న సినిమాల హంగామాతో తిరిగి టాలీవుడ్ లో మళ్ళీ సందడి మొదలవుతుంది. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగ సుమారు 15 రోజుల పాటు ప్రేక్షకులు ఉంటారు కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అయ్యే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. 


ఈ లిస్టులో ఇప్పటికే అనుష్క ‘నిశ్శబ్దం’ తన బెర్త్ ను రిజర్వ్ చేసుకోవడంతో ఆ బెర్త్ తమకు కావాలి అంటూ చాలామంది చిన్న సినిమాల నిర్మాతలు తమ నిర్మాతల మండలికి అభ్యర్ధనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ ఎప్పుడు విడుదలైనా జనం వచ్చి చూస్తారని అయితే తమ చిన్న సినిమాల విడుదల ఇంకా ఆలస్యం అయితే కనీసం తమ సినిమాలను చూడటానికి కూడ ఎవరు రారని అందువల్ల ఏప్రిల్ లోని మొదటి రెండు వారాలు తమ చిన్న సినిమాలకు ఇచ్చి పెద్ద సినిమాలు లైన్ క్లియర్ చేయాలి అంటూ ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘ఉప్పెన’ నిర్మాతలు నిర్మాతలమండలి పై ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్.


దీనితో ఇలా చిన్న సినిమాలను ముందు క్లియర్ చేస్తే ఇప్పటికే విడుదలకు రెడీగా ఉన్న అనుష్క ‘నిశ్శబ్దం’ కు నాని ‘వి’ కి కోరుకున్న రిలీజ్ డేట్స్ దొరకడం కష్టం అని అంటున్నారు. ఇప్పటికే పెద్ద సినిమాల నిర్మాతలకు చిన్న సినిమాల సినిమాల నిర్మాతలకు గ్యాప్ ఓపెన్ గా కనిపిస్తున్న పరిస్థుతులలో ఈ కరోనా సమస్య వల్ల మూత పడ్డ ధియేటర్ల సమస్య చిన్న సినిమాల నిర్మాతలను బాగా ఆర్ధికంగా కుంగ తీస్తుందిఅన్న వార్తలు వినిపిస్తున్నాయి. 


కరోనా దెబ్బతో చిన్న సినిమాల ప్లాన్స్ అన్నీ అప్ సెట్ కావడంతో ఇంకా విడుదల కాకుండానే వైష్ణవ్ తేజ్ మూవీ ‘ఉప్పెన’ కు కోటి రూపాయల నష్టం వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాల కోసం అప్పుడే కోటి రూపాయల ఖర్చు జరిగిపోవడంతో ఇప్పుడు ‘ఉప్పెన’ రిలీజ్ డేట్ కూడ మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడటంతో మైత్రీ మూవీ లాంటి పెద్ద సంస్థలకు కూడ కరోనా దెబ్బ తగిలింది అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: