ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని పడేస్తాడు. అయినా ఆశపడిన హిట్ మాత్రం రావడం లేదు. శర్వానంద్ కొన్నాళ్ల నుంచి ఒకే ఒక్కహిట్ కోసం ఎదురు చూస్తున్నాడు . ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు . ఏ జానర్ ట్రై చేసినా ..ఎన్ని కొత్త స్టోరీలు ప్రేక్షకుల ముందుకు తెచ్చినా..హిట్ అవుతుందని ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా..ఎక్కడో బోల్తా పడుతున్నాడు శర్వానంద్. 

 

శర్వానంద్ .. హీరోగానేకాదు..మంచి పర్ ఫామర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇంత యాక్టింగ్ స్కిల్ ఉన్న ఏ హీరో అయినా..ఇప్పటికి స్టార్ హీరో రేంజ్ కి వెళ్లాలి. ఎక్కడికో వెళ్తాడనుకున్న శర్వానంద్ సరైన సక్సెస్ లు లేక ఎటో వెళ్తున్నాడు. మహానుభావుడు సినిమా చేసినా తర్వాత ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. 

 

మారుతి డైరెక్షన్లో వచ్చిన మహానుభావుడు  సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత పడిపడిలేచెమనసు సినిమా వచ్చింది. సాయిపల్లవి, శర్వానంద్ ఇద్దరూ మంచి పర్ ఫామర్స్ . ఇంటెన్స్ లవ్ స్టోరీ . ఆ లవ్ స్టోరీ ని అంతే ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించే డైరెక్టర్ హను రాఘవపూడి. సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ అర్దం పర్దంలేని స్క్రీన్ ప్లే తో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

 

ఎప్పుడూ సో కాల్డ్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఢిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకునే శర్వా పడిపడిలేచెమనసు సినిమా తర్వాత రణరంగం సినిమా చేశాడు. గ్యాంగ్ స్టర్ గా, యంగ్ గా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపించాడు శర్వా. అంతేకాదు.. ఈ సినిమాలో సీరియస్ యాక్షన్ కూడా చేశాడు. సినిమాని ఈగర్ గా తెరకెక్కించే సుధీర్ వర్మ  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ నుంచే మంచి ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. కానీ ఎందుకో జనాలు ఈ సినిమాని ఆదరించలేదు . ఆలా రణరంగం కూడా మిస్ ఫైర్ అయ్యింది. 

 

రణరంగం ఫ్లాప్ తర్వాత కూడా పెద్దగా ఆలోచించకుండా తన పంథాలో మరో కొత్త ఇంటెన్సివ్ లవ్ స్టోరీని రీమేక్ చేశాడు . విజయ్  సేతుపతి, త్రిష జంటగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 సినిమాను జానుగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు . తమిళ్ లో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే  తెలుగులో కూడా డైరెక్ట్ చెయ్యడంతో సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నారు. కానీ అస్సలు అంచనాలను అందుకోలేకపోయింది. ఇలా మంచి సబ్జెక్ట్, డిఫరెంట్ జానర్ , క్రేజీ కాంబినేషన్..ఇలా  ఏ రకంగా ప్రయత్నించినా శర్వా కు సక్సెస్ అందకుండానే పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: