క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎప్పుడూలేనంత ఫాస్ట్ గా సినిమా చేస్తున్నాడు . గీతగోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్.. ఇలా విజయ్ సినిమాలు చాలావరకూ షూటింగ్ డిలే అవుతూ..ఎక్కువ రోజులు సాగుతూ... వచ్చాయి. బట్ ..కెరీర్ లో ఫస్ట్ టైమ్..పూరీతో సినిమా ఇలా అనుకున్నాడో లేదో ..అనుకున్నంత స్పీడ్ గా షూట్ స్టార్ట్ చేసేశాడు విజయ్.విజయ్ ప్రస్తుతం పూరీజగన్నాధ్ తో ఫైటింగ్ సినిమా చేస్తున్నాడు. పూరీ మేకింగ్ స్టైల్ తెలిసిందే. అనుకున్నాడంటే ఆఘమేఘాల షూటింగ్ అవ్వగొట్టే వరకూ నిద్రపోడు . కెరీర్ స్టార్టింగ్ నుంచే ఇదే స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు పూరీ.

 

పూరీ ఒక సినిమా చేసే మ్యాగ్జిమమ్ షూటింగ్ టైమ్ .. 3 నెలలు. కానీ విజయ్ దేవరకొండతో చేస్తున్న ఈ ఫైటర్ కి అంతకుమించి టైమ్ పట్టేలాఉంది. అలా అయితే పూరీ కెరీర్ లో ఈ సినిమానే  ఎక్కువ రోజులు టైమ్ తీసుకున్న సినిమా అవుతుంది. పూరీ కనెక్ట్స్, కరణ్ జోహార్  కంబైన్డ్ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. అంతే కాదు భారీ బడ్జెట్ కూడా ఉండడంతో సినిమాకి ఎక్కువ టైమ్ పట్టేలా ఉంది. అయినా సరే .. తన ఫాస్ట్ మేకింగ్ ఫార్ములాని ఫాలో అవుతూనే ఉన్నాడు పూరీ. సినిమా స్టార్ట్ చేసినప్పుడే ముంబై లో 40 రోజుల షెడ్యూల్ వేశాడు పూరీ.

 


విజయ్ దేవరకొండకు జంటగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ లాంటి మెయిన్ క్యారెక్టర్స్ నటిస్తున్న ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ 40 రోజుల ఫస్ట్ షెడ్యూల్ సూపర్ గాకంప్లీట్ అయ్యిందని ,మెయిన్ స్టార్ కాస్ట్ తో ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కించామని  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టీమ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: