టాలీవుడ్ లో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినప్పటికీ... ప్రస్తుతం అభిమానులు దర్శకులు హీరోలు మొత్తం రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ మల్టీస్టారర్ సినిమా గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్  అనే సినిమా పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి కేవలం అభిమానులే కాదు దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు అంటే ఈ సినిమాపై ఎంత అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా గురించి కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎంతో మంది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న  లీక్ విడుదలైన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. 

 

 అయితే ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా అల్లూరి సీతారామరాజు పాత్రలో  రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చరిత్రలో కలవని ఇద్దరు స్వతంత్ర సమరయోధులు ఒకవేళ కలిస్తే ఎలా ఉండబోతుంది అనే కాల్పనిక కథ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. అయితే ఈ సినిమాను ఈ సంవత్సరంలో విడుదల అవుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తే... అభిమానులు అందరికి షాక్ ఇస్తూ... వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన సినిమాను విడుదల చేస్తానంటూ జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అటు ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులకు నిరీక్షణ తప్పేలా లేదు. 

 

 

 అయితే మామూలుగానే రాజమౌళి సినిమాలు అంటే విడుదల తేదీ ఎప్పుడూ వాయిదా పడుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్   సినిమాకు సంబంధించి విడుదల తేదీ మరోసారి వాయిదా పడుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై అటు రాజమౌళి నుంచి ఎలాంటి ప్రకటన లేనప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు మాత్రం అభిమానులను అయోమయంలో పడేస్తున్నాయి. ఇప్పటికే ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా విడుదల వాయిదా పడితే మాత్రం మరింత నిరీక్షణ తప్పదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: