త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్, ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా బడ్జెట్లో హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్లకే దాదాపుగా 60 కోట్లు ఇవ్వబోతున్నారట. అంటే మిగతా నటీనటులు, టెక్నీషియన్లకి, ప్రొడక్షన్‌కి కలపి 60 అవుతుందన్నమాట. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగువారంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ చిత్రం. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సీన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయట. ఈ చిత్రంలో ప్రధాన హైలెట్స్ అన్నీ కూడా డైలాగ్‌ల పై ఎక్కువ ఆధారపడి ఉంటాయట. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగులు అదుర్స్ అని అంటున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో మొత్తం మూడు గెటప్స్‌లో కనిపిస్తాడట. ఈ చిత్ర టైటిల్ ని ప్రేక్షకుల ముందుకు వివరంగా తీసుకురావాలని ఈ వారం చిత్ర యూనిట్ భావించింది. అవేమిటంటే రామ రావణ రాజ్యం.
మరొకటి రఘుపతి రాఘవ రాజా రాం తాము తీసుకుంటామని సదరు నిర్మాతలు టైటిల్ విషయంలో రాజమౌళిని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఎక్కువ డిమాండ్ చెయ్యడంతో రాజమౌళి వెనుతిరిగినట్లు సమాచారం. మరిచివరికి దీనికి ఆయన ఎలాంటి అప్డేట్ ఇస్తారో వేచి చూడాలి. మరి టైటిల్ విషయంలో రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ఇప్పటికే 80శాతం పూర్తయిందని సమాచారం. మరి ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే.