పది సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడూ కొత్త డైరెక్టర్ల జోలికి వెళ్లని  మెగా హీరో .. రొటీన్ ని బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ కి వెల్ కమ్ చెబుతున్నాడా..? సో కాల్డ్ హీరోగా కాకుండా ఈ మధ్య డిఫరెంట్  స్టోరీస్ ని సెలక్ట్ చేసుకుంటున్న రామ్ చరణ్ ఏ కొత్త డైరెక్టర్ తో సినిమాకు ఓకే చెయ్యబోతున్నాడు..? 

 

 

రామ్ చరణ్ సినిమా సెలక్షన్  మారిపోతోంది. రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలకు  ఓటేస్తున్నాడు . లాస్ట్ టైమ్ రంగస్తలంలో చెవిటి వాడిగా ఛాలెంజింగ్ రోల్ చేసి సక్సెస్ దక్కించుకున్న రామ్ చరణ్ .. ఇప్పుడు రాజమౌళి సినిమాలో అల్లూరి సీతారామరాజుగా హిస్టారికల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు . 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీ మీద ప్యాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.  

 

 

జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ కాంబినేషన్లొ, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ  "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ ప్రస్తుతం కోకా పెట్ లో జరుగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ ఆరెనెలలు పోస్ట్ పోన్ అవ్వడంతో .. చరణ్ నెక్ట్స్ సినిమా మీద ఇప్పటినుంచే దృష్టి పెట్టాడు . అందుకే గ్యాప్ దొరికినప్పుడల్లా కథలు వింటున్నాడు .  ఇప్పటికే అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి లాంటి తనతో సినిమా చేద్దామనుకుంటున్న డైరెక్టర్లతో మీటింగులు కూడా పెట్టేశాడు . వీళ్లందరూ కాకుండా భీష్మతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమా చేద్దామన్న ప్లాన్ లో కూడా ఉన్నాడట మెగా పవర్ స్టార్ .  

 

 

ఇలా రొటీన్ గా కాకుండా తనకెరీర్ లో ఎప్పుడూచెయ్యని ఎక్స్ పెరిమెంట్ చేద్దామనుకుంటున్నాడట  చరణ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ కొత్త దర్శకులతో సినిమా చెయ్యలేదు ఈ మెగా హీరో. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింట్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే చరణ్ కూడా కొత్త డైరెక్టర్ తో సినిమా చేద్దామనుకుంటున్నాడట .

 

 

రీసెంట్ గా  కొత్త డైరెక్టర్ చెప్పినకథ  చరణ్ కి నచ్చడంతో దానికి కొన్ని చేంజెస్ చెప్పాడని, మైత్రిమూవీ మేకర్స్ లో భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కబోతోందని టాలీవుడ్ లో రూమర్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: