సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు గడుస్తున్నా వారి మధ్య ప్రేమ మాత్రం పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గడంలేదు. నాగ చైతన్య తన భర్త గా రావడం తన అదృష్టం అని సమంత సవాలక్ష సందర్భాలలో చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే నాగ చైతన్య సామ్ ని ఎంత బాగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. వారు సోషల్ మీడియాలో చేసే పోస్టులను చూస్తే వారి మధ్య వివాహ బంధ ఎంత దృఢంగా ఉందో స్పష్టమవుతుంది. జాను చిత్రం లో చివరిగా కనిపించిన సమంత అక్కినేని ప్రస్తుతం నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఓ సినిమా లో నటిస్తోంది. అయితే ఈ క్రమంలోనే సమంత తన భర్త నాగచైతన్య తో కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూ లో ఈ దంపతులు తమ వివాహ బంధం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.




సమంత అక్కినేని మాట్లాడుతూ... 'నాగచైతన్య మొదటి భార్య ఒక దిండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక పిల్లో ని పొద్దస్తమానం పట్టుకొనే ఉంటాడు. నాతో గడిపే సమయం లో కూడా తాను పిల్లో ని హాగ్ చేసుకొనే ఉంటాడు. చివరికి మేము ముద్దు పెట్టుకుంటున్న మా మధ్య ఒక దిండు ఉంటూనే ఉంటుంది' అని నవ్వుతూ చెబుతుంది.




నాగ చైతన్య మాట్లాడుతూ... ' సమంత నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా ఫిలిం కెరియర్ విజయవంతంగా కొనసాగుతోంది. తను నా లక్కీ చామ్', అని చెప్పుకొచ్చాడు.




సామ్ ఇంకా మాట్లాడుతూ... 'మేము ఒక్కరం కావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. నేను లవర్ గా ఉన్న చైతన్య కంటే భర్త గా ఉన్న చైతన్య నే ఎక్కువగా ఇష్టపడుతున్న' అని నవ్వుకుంటూ చైతన్య లో భర్త అయిన తర్వాత వచ్చిన మంచి మార్పుల గురించి చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: