ప్ర‌తి శుక్ర‌వారం కొన్ని కొత్త సినిమాలు విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని హిట్ల‌యితే మ‌రి కొన్ని ఫ‌ట్ల‌వుతాయి. మ‌రి ఈ వారం సంద‌డి చేసిన సినిమాలేంటో ఓసారి చూద్దాం. అలాగే ఏ సినిమా ఎలా ఉన్నాయి. ఏవి కాస్త చూడొచ్చు. ప‌ర్వాలేదు అన్న విశేషాలు తెలుసుకుందాం.

 

శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో రాహుల్, త్రిష్ణా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వచ్చిన చిత్రం ‘మధ’. ఏకంగా 26 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ చిత్రం ట్రైల‌ర్ చూసి అదిపోయింద‌ని చాలా మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్ కి వెళుతున్నారు. అయితే ఈ సినిమా ఆశించినంత‌గా లేక‌పోయినా ప‌ర్వాలేద‌నిపించుకుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో లాస్ట్‌వ‌ర‌కు కూడా స‌స్పెన్స్‌కోణాన్ని బాగానే మెయిన్‌టెయిన్ చేసింది శ్రీ‌విద్య‌.

 

వైవిధ్యభ‌రిత మైన క‌థ‌తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అయితే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల కాస్త బోర్ అనిపిస్తుంది. అలాగే కొన్ని చెట్ల కాస్త క‌న్‌ఫ్యూజింగ్ కూడా ఉంటుంది. క‌థ‌ను ఎలా తీసుకువెళుతున్నారో అర్ధం కాలేదు. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం లాంటివి సినిమాకి డ్రా బ్యాగ్స్ గా నిలిచాయి. కానీ, శ్రీవిధ్య డైరెక్షన్ అండ్ ఆమె చేసిన సిన్సియర్ అటెంప్ట్ బాగా ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. 

 

కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, సయ్యద్, సోహైల్ రియాన్, షాలిని, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యురేక’. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప‌ర్వాలేద‌నిపించుకుంది. మొత్తం మీద, ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ సాగిన ఈ చిత్రం. రెండవ భాగంలో మాత్రం కొన్ని సీన్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని స‌న్నివేశాలు మాత్రం బోరింగ్ ప్లేతో పాటు చాలా సన్నివేశాల్లో కనీస ఇంట్రస్ట్ లేకపోవడంతో సినిమా పై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తిని నీరుగారుస్తోంది. ఓవరాల్ ఈ సినిమా పెద్ద‌గా ఆకట్టుకోలేద‌నే చెప్పాలి.

 

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఈ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ నిర్మాత. మురళీ రామస్వామి దర్శకుడు. మరి ఈ సినిమా స్టేట‌స్ ఏంటంటే... ‘ప్రేమ పిపాసి’గా వచ్చిన ఈ యవ్వన ప్రేమకథ, సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ తో పాటు హీరో జిపిఎస్ బాధాకరమైన ప్రదర్శన కూడా ఆకట్టుకుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో సరైన ఇంట్రస్టింగ్ పాయింట్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల కొంత బోర్ అనిపిస్తుంది. అలాగే సినిమాలోని మెయిన్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఎలివేట్ కాకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. 

 

కల్వకోట సాయితేజ – తరుణీ సింగ్ జంటగా ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. సంతోష్ రెడ్డి లింగాల నిర్మించిన లవ్ థ్రిల్లర్ ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. మరి ఈ చిత్రం ప్రేక్షుకులను ఎంతవరకు ఆకట్టుకుందంటే... ‘శివన్’ అంటూ న్యూ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తీసిన చిత్ర‌మిది. అంతేకాక కొన్ని ఫ్యూ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ అనేవి పెద్ద‌గా బలంగా అనిపించ‌లేదు. పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

 

దివంగత నటుడు విజయ్ సాయి, భవిక జంటగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 302. దర్శకుడు కార్తికేయ మిర్యాల తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం… 302 మూవీ నిర్జీవంగా సాగే క్రైమ్ డ్రామా. క‌థ ప్రేక్ష‌కుడిని అస‌లు ఎక్క‌డా కూడా ఆకట్టుకోదు. క‌థ‌లో ఎక్క‌డా ఒక‌దానికి ఒక‌టి పొంతన లేకుండా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. హీరోయిన్ గ్లామర్, వెన్నెల కిశోర్ ప్రజెన్స్ కొంచెం ఆహ్లాదం కలిగించే అంశాలు. అంతకు మించి ఈ చిత్రంలో ఇంకేమీ లేద‌నే చెప్పాలి. 

 

ఫైన‌ల్‌గా ఈ వారం సినిమాల‌న్నీకూడా ఏదో ప‌ర్వాలేదు అన్న‌ట్లు ఉన్నాయి త‌ప్పించి చూడ‌ద‌గ్గ సినిమాలేమీ లేవు. ఏదో కొంత వ‌ర‌కు ప‌ర్వాలేదు అనిపించే సినిమా ఏద‌న్నా ఉందంటే అది `మ‌ధ‌` కాస్త చూడొచ్చు అని చెప్ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: