తమిళ స్టార్ హీరో విజయ్ ,ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయగా ఇటీవల విడుదలైన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ల కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈసినిమా నుండి హీరోయిన్ మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ విడుదలైయింది. ఇక ఈ రోజు  మాస్టర్ ఆడియో లాంచ్ ఈవెంట్ లీలా ప్యాలెస్ లో జరుగనుంది అయితే కరోనా భయం వల్ల  ఈవేడుక కు ఫ్యాన్స్ కు అలాగే మీడియా ను అనుమతించడం లేదు కేవలం చిత్ర యూనిట్ సమక్షంలోనే ఈ ఈవెంట్ జరగనుంది.
 
మొత్తం ఆడియో ఆల్బమ్ లో 8సాంగ్స్ వుండనున్నాయి.  కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడంతో ఈచిత్రంపై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎక్స్ బి క్రియేటర్ నిర్మిస్తుంది. ఇక ఈచిత్రాన్ని తెలుగులో మహేష్ ఎస్ కోనేరు విడుదలచేయనున్నాడు.
 
ఇంతకుముందు విజయ్ నటించిన  విజిల్(బిగిల్) ను తెలుగులో విడుదలచేసిన కోనేరు ఆ సినిమా తో మంచి లాభాలను అందుకున్నాడు. ఇక ఇటీవల సర్కార్, విజిల్ తెలుగు లోకూడా సూపర్ హిట్లు కావడం తో విజయ్ మార్కెట్ పెరిగింది దాంతో మాస్టర్ పై తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు వున్నాయి. ఏప్రిల్ చివర్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈసినిమా తరువాత  విజయ్  తన తదుపరి చిత్రాన్ని గురు ఫేమ్ సుధా కొంగర తో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: