బుల్లితెర మీద క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న సుధీర్ రష్మిల రిలేషన్ పై ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. మా ఇద్దరి మధ్య ఏది లేదు అంటూనే షోలో నానా రచ్చ చేస్తారు. రష్మిని చూడగానే సుధీర్ వెంటపడటం ఆమె ఛీ అంటూ చీదరించుకోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొడుతున్నా సరే వాళ్లిద్దరూ మాత్రం అదే పంథా కొనసాగిస్తున్నారు. జబర్దస్త్ లో వీళ్ళ కెమిస్ట్రీ చూసిన మల్లెమాల వాళ్ళు ఢీ జోడీకి తీసుకున్నారు.

 

అక్కడ కూడా వీరిద్దరి హంగామా తెలిసిందే. ఆన్ స్క్రీన్ లో అలా రెచ్చిపోయే వీరిద్దరు ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఎవరికి వారు అన్నట్టుగా ఉంటారు. జబర్దస్త్, ఢీ షోలు చేస్తూనే సినిమాల్లో బిజీ అయ్యింది రష్మీ. గుంటూరు టాకీస్ లాంటి సినిమా చేసి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు అదే తరహా పాత్రలకు కేరాఫ్  అడ్రెస్ గా మారింది. ఇక సుధీర్ కూడా ఈమధ్యనే హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో నటించాడు.

 

సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత జబర్దస్త్ తన టీమ్ తో కలిసి 3 మంకీస్ అంటూ మరో ప్రయత్నం చేశారు. రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో సుధీర్ వెనక్కి తగ్గాడు. సుధీర్, రష్మీ ఇద్దరు స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్ పై మంచి ఛాన్సులు అందుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాత్రం ఎవరు చెప్పట్లేదు. సుధీర్ ఈమధ్య రష్మీ లేనిదే తాను లేను.. ఎందుకంటే తన వల్లే సుధీర్ కు ఇంత గుర్తింపు వచ్చిందని చెప్పాడు. మరి ఇంత మంచి అండర్  స్టాండింగ్ ఉన్న వీరు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటైతే ఆ కిక్ వేరేలా ఉంటుంది. వాళ్ళు చేసేది అంతా నటనే అని తెలిసినా ఒక్కోసారి నిజమే అన్నట్టుగా వారి ప్రవర్తన ఇలాంటి వార్తలకు కారణం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: