టాలీవుడ్ లో మ‌హేష్ క్రేజే వేర‌ని చెప్పాలి. మ‌హేష్‌కి ఉన్నంత క్రేజ్ ఇంకెవ‌రికీ లేదు. ఆయ‌న సినిమాలంటే చాలు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాక మ‌హేష్‌కి కాస్త లేడీస్ ఫాలోయింగ్ కూడా కొంచం ఎక్కువ‌నే చెప్పాలి. ఇక ఇటీవ‌లె సంక్రాంతికి విడుద‌లైన హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం స‌క్సెస్‌లో మ‌హేష్ ప్ర‌స్తుతం ఉన్నారు. అయితే ముందుగా చెప్పిన‌ట్లే ఈ చిత్రం త‌ర్వాత ఆయ‌న ఒక మూడు నెల‌ల పాటు గ్యాప్ తీసుకుంటాన‌ని అన్నారు. 

 

ప్ర‌స్తుతం వంశీపైడిప‌ల్లి సినిమాతో ఆయ‌న బిజీ అవ్వ‌వ‌ల‌సి ఉంది కానీ అది స్క్రిప్ట్ స‌రిగా రాక‌పోవ‌డంతో ఆ ప్రాజ‌క్ట్ కాస్త పెండింగ్‌లో ప‌డింది. దీంతో కొర‌టాల సినిమాలో మ‌హేష్ అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ క‌థ అటు చిరంజీవి ఇటు మ‌హేష్‌కి ఇద్ద‌రికి న‌చ్చ‌డం వ‌ల్ల ఓకే అనుకున్నార‌ట‌. అయితే కాస్త రెమ్యూన‌రేష‌న్ ఎక్కువ అవ్వ‌డంతో ముందు కొంచం ఆలోచించారు కానీ మ‌హేష్‌నే  ఆ పాత్ర కోసం ఫైన‌ల్ చేశారు కొర‌టాల‌. 

 

ఇక ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం మ‌హేష్ మాత్రం ఎక్క‌డా ఖాళీగా అయితే ఉండ‌డం లేదు ఏదో ఒక ప‌ని చేస్తూనే ఉన్నారు. ఏదో ర‌కంగా కెమెరాను ఫేస్ చేస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా...  ఎలా అంటే... చిన్న చిన్న టివి ప్ర‌క‌ట‌లు ప్లాన్ చేస్తూ ఎప్పుడూ ఏదో ర‌కంగా తెలుగుప్రేక్ష‌కుల‌ను ఆయ‌న  అల‌రిస్తూనే ఉన్నారు. దాంతో మ‌హేష్ ఎప్పుడూ సినిమాల‌కు ఆయ‌న దూరంగా ఉన్న భావ‌న ఎవ్వ‌రికీ క‌ల‌గ‌డం లేదు. అయితే ఇదంతా ఆయ‌న ప‌క్కాప్ర‌ణాళిక‌తో చేస్తున్నాడు అనుకుంటున్నారా? అస్స‌లు కానే కాదు. మ‌హేష్ ఇలా ఏదో ఒక వ్యాప‌కం పెట్టుకుని నిరంత‌రం కష్ట‌ప‌డుతూ ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అలాగే ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేస్తూ జాగ్ర‌త్త‌గా ఆయ‌న కెరియ‌ర్‌ని ప్లాన్ ప్ర‌కారం తీసుకువ‌చ్చేది ఎవ‌ర‌నుకుంటున్నారు. అంతా ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త. మ‌హేష్ ప్ర‌తి మూవీ, ప్ర‌తి యాడ్ ఆయ‌న‌కు సంబంధించిన దంతా త‌నే ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌హేష్‌కి సంబంధించిన‌ది ఏదైనా స‌రే న‌మ్ర‌త ఓకే అన్నాకే జ‌రుగుతుంద‌ట‌. ఆమె అంత క‌రెక్ట్‌గా ప‌ర్‌పెక్ట్ ప్లానింగ్‌తో వెళుతుంది. ఇక టాలీవుడ్ లో ఏ హీరో భార్య కూడా ఇంత ప్లానింగ్ గా ఆలోచించ‌లేర‌ని కొంద‌రు సినీ పెద్ద‌లు అంటున్నారు. మ‌హేష్‌కి ఉన్న ఈ ఫెసిలిటీ మ‌రే హీరోకి లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: