బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. ఆ సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఆ సినిమా భారీగా వసూళ్లు చేయడంతో బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో కూడా అక్కడి దర్శకులు ప్రభాస్ తో సినిమా చేయడానికి మొన్నీ మధ్య ప్రయత్నాలు చేసారు. వసూళ్ళ పరంగా ప్రభాస్ కమర్షియల్ హీరోగా బాలీవుడ్ హీరోల పక్కన నిలబడ్డాడు. సాహో సినిమా ఫ్లాప్ అయినా సరే భారీగా వసూలు చేసింది. 

 

ఇక అక్కడి నుంచి ప్రభాస్ తో సినిమాలు చేస్తే చాలు అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ మాత్ర౦ చాలా ఆలస్యం చేస్తున్నాడు. సాహో సినిమాకు దాదాపు రెండేళ్ళు తీసుకున్న ప్రభాస్... ప్రస్తుతం చేస్తున్న సినిమాకు కూడా రెండేళ్లకు పైగా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైనా దర్శక నిర్మాతలు వచ్చి సినిమా చెయ్యాలని అడిగినా సరే... ప్రభాస్ మాత్రం స్పందించడం లేదు. ఇటీవల కొంత మంది నిర్మాతలు ప్రభాస్ కోసం ప్రయత్నాలు చేసినా సరే ప్రభాస్ మాత్రం అందుకు అంగీకరించలేదు. తాను రెండేళ్ళ పాటు ఏ సినిమాలు చేసేది లేదని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. 

 

కరణ్ జోహార్ ఎప్పటి నుంచో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే ప్రభాస్ మాత్రం ఏ స్పందనా చెప్పడం లేదు. దీనిపై దర్శక నిర్మాతలు కాస్త అసహనంగానే ఉన్నారు. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అయితే అతనికి అసలు సినిమాల మీద ఆసక్తి లేదని మరికొంత మంది అంటున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో మరో సినిమాను ఎప్పుడు ఓకే చేస్తాడో చెప్పలేని పరిస్థితి. ఎవరికి ఓకే చెప్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: