అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది అనేది వాస్తవం. గతంలో అతని సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు అనేది అర్ధమవుతుంది. ఆ రేంజ్ లో ఈ సినిమా విజయం సాధించింది. వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. భారీగా వసూళ్లు సాధించి అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అతను చేసే సినిమాలపై ఆసక్తి పెరిగింది. అతనితో సినిమాలు చేయడానికి ఎందరో దర్శకులు పోటీ పడుతూ అతనితో చర్చలు జరుపుతున్నారు. 

 

ప్రస్తుతం అతను సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా తర్వాత అతనితో సినిమా చేయడానికి కొందరు దర్శకులు పోటీ పడుతున్నారు. బాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత ఆలు అర్జున్ తో సినిమా చేసేందుకు గాను చర్చలు జరుపుతున్నారు. అతనితో సినిమా చేసేందుకు ఇప్పటికే హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. 

 

ఇక ఈ సినిమా ఏమో గాని అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి, ఒక తమిళ దర్శకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆ సినిమా కోసం తమిళ దర్శకుడు తాను చేసే సినిమాలను కూడా వాయిదా వేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అతనితో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీనికి అల్లు అర్జున్ ఎం అంటాడు అనేది చూడాలి. ప్రస్తుతం సుకుమార్ సినిమా మీదే అతను ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాతే మరో సినిమా అంటున్నాడు. మరి ఏ సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: