రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో సుమంత్ తెలుగుతెరకు పరిచయం అయ్యాడు.. ఈ చిత్రాన్ని 1999 సంవత్సరంలో నిర్మించారు.. ఆ తర్వాత వచ్చిన చిత్రం యువకుడు.. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఫర్వాలేదు అనే విధంగా ఉంది కానీ సుమంత్ కెరియర్‌ను హిట్ బాట పట్టించలేదు.. మరో రెండు సినిమాలు చేసిన అవికూడా అంతంత మాత్రమే.. ఈ దశలో 2003 లో వచ్చిన సత్యం సినిమాతో మంచిగుర్తింపు సాధించాడు.. ఆ తర్వాత వచ్చిన గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. ఇలా ఎన్నో అపజయాలు, విజయాలు పలకరిస్తూ ముందుకు సాగుతున్న సుమంత్ విషయంలో ఒక రహస్య ఒప్పందం జరిగిందట..

 

 

అదేమంటే అక్కినేని నాగేశ్వర్‌రావు సుమంత్‌ను దత్తకు తీసుకున్నాడట.. ఒక్క సారిగా షాక్‌కు గురికాకండి.. ఎందుకంటే సుమంత్ నాగేశ్వర్‌రావుకు మనుమడు కదా అని మీ మెదడును తొలిచే ఆలోచనలను పక్కనపెట్టి పూర్తిగా చదవండి.. అసలు విషయం ఏంటంటే సొంత కూతురు దగ్గర సుమంత్ ను నాగేశ్వర్‌రావుగారు దత్తత తీసుకున్నారు.. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.. ఆ కాలంలో రోజుకు 6 నుండి 7సినిమాల వరకు చేసే నాగేశ్వర్ రావు గారు తనపిల్లలతో గడిపే అవకాశాన్ని పూర్తిగా మిస్సయ్యాడట.. అంతే కాకుండా అంత బిజీగా షూటింగ్‌ల్లో గడిపే ఈయనకు ‘అందాల రాముడు’ సినిమా షూటింగ్ సమయంలో హార్ట్ ఎటాక్ రాగా, ఇతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలపడంతో ఇంటికే పరిమితం అయ్యాడట..

 

 

ఆ సమయంలోనే సుమంత్ పుట్టడం ఆ పిల్లవాడితో ఆడుకోవడంతో నాగేశ్వర్ రావుగారికి సుమంత్‌తో విడదీయలేని అనుబంధం ఏర్పడగా క్రమక్రమంగా తాతగారింట్లోనే సుమంత్ ఎక్కువగా ఉండేవాడట.. ఇలా ఒకరోజు అమెరికాలో ఉన్న సుమంత్ తల్లితండ్రులకు సుమంత్ ను దత్తత తీసుకుంటున్నట్టు లేక రాశారట.. ఆ విధంగా సుమంత్ ను అక్కినేని నాగేశ్వర్‌రావు, ఆయన భార్య అన్నపూర్ణ దత్తత తీసుకొవడంతో, ఈ మనవడు కొడుకుగా కూడా మారి.. ఇలా రెండు పాత్రలను పోషించాడట.... దీంతో అందరికంటే సుమంత్ పైనే నాగేశ్వర్‌ రావుకు ఎక్కువ ప్రేమ ఉండేదట.. అలా సుమంత్ నాగేశ్వర్‌ రావుకు ఫేవరెట్ మనవడు అయిపోయాడని చెబుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: