ఇప్పుడు కోలీవుడ్ లో నయనతార ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఆమె చేసే సినిమాలు ఆమె ఒప్పుకునే దర్శకులు అన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటున్నాయి. చిన్న చిన్న సినిమాలను ఆమె ఒప్పుకోవడం లేదు. భారీ పారితోషికం వస్తేనే ఒప్పుకుంటుంది. ఆమెకు వయసు మీద పడుతుంది. అయినా సరే డిమాండ్ చేసే విషయంలో పాప ఎక్కడా వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. దాదాపు అందరు స్టార్ హీరోలతో తమిళంలో ఆమె ఆడి పాడింది. ప్రస్తుతం ఆమె సినిమాలు అంతగా ఆడకపోయినా సరే అభిమానులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో హీరోలు ఆమెను కోరుతున్నారు. 

 

ఇటీవల ఆమె ఒక ప్రకటన చేసింది. కథ డిమాండ్ చేస్తే తాను లిప్ లాక్ కి, బికినీ వేయడానికి రెడీ అని అంటుంది. దీనితో ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలని ఎందరో దర్శకులు పోటీ పడుతున్నారు. ఇదే అదునుగా భావించి ఆమె సినిమా చేయడానికి భారీగా డిమాండ్ చేస్తుంది. ఆ సినిమాసినిమా అనే తేడా లేకుండా ఎక్కువగా వసూలు చేయడం మొదలుపెట్టింది ఆమె. ఈ మధ్య ఆమె గురించి నిర్మాతల మండలిలో చర్చ జరిగింది అని, ఆ చర్చలో ఆమె పారితోషికం గురించి ఎక్కువగానే చర్చ జరిగిందని, నిర్మాతలు అందరూ ఏక తాటిపైకి వచ్చారని, 

 

ఆమెకు పారితోషికం తగ్గించడానికి రెడీ అయ్యారని అనుకున్నారు. కాని ఆమె ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముందు వాళ్ళ డిమాండ్ కి తల వంచిన నయనతార ఇప్పుడు భారీగా డిమాండ్ చేయడం మొదలుపెట్టడం, దానికి తోడు స్టార్ హీరోలు ఆమెతో సినిమా చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపించడం తో ఇప్పుడు నయనతార ఇష్టం వచ్చినట్టు రేటు పెంచుతుంది. ఆ విషయంలో ఆమె ఎక్కడా కూడా వెనక్కు తగ్గే సాహసం ఏ మాత్రం చేయడం లేదని, చేస్తే చేయండి లేకపోతే లేదు అంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: