తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్. గత నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యకమాలు జరుపుకుంటుంది. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు  మాస్టర్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో భాగంగా ఈ అల్బమ్ లో ఏకంగా 12 సాంగ్స్ వుంటాయని అందులో ఎనిమిది పాటలు ఇప్పుడు విడుదలవుతాయి మరో రెండు సాంగ్స్ వచ్చే వారం లో రిలీజ్ కానున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ వెల్లడించాడు. 
 
అలాగే ఇటీవల విడుదలైన మూడు పోస్టర్ల గురించి లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. అందులో ఫస్ట్ లుక్ పోస్టర్ విజయ్ ఎంట్రీ సీన్ కాగా రెండో లుక్ ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చేది.. మూడోది క్లైమ్యాక్స్ లో వచ్చే సన్నివేశం అని వివరించిన లోకేష్ ఈ సినిమాట్రైలర్ ను మార్చి 22న విడుదలచేయనున్నామని పేర్కొన్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా ఆండ్రియా , శంతన్ భాగ్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఎక్స్ బి క్రియేటర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకానుంది.
 
ఇక మాస్టర్  తెలుగు వెర్షన్ హక్కులను మహేష్ ఎస్ కోనేరు దక్కించుకున్నాడు. ఇంతకుముందు విజిల్(బిగిల్) ను కూడా తెలుగులో కోనేరే విడుదల చేసి హిట్ కొట్టాడు. ఇక సర్కార్, విజిల్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి  విజయ్ తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువకావడం తో మాస్టర్ పై ఇక్కడ కూడా భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: