ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దేశవిదేశాల్లో విహరిస్తూ, భారత దేశంలోనూ కోరలు చాస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ హీరోలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.   ఈ నెల 31 వరకూ స్కూళ్లు, థియేటర్లు, మాల్స్‌ను మూసివేస్తూ... తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా మెగాస్టార్ చిరంజీవి సమర్థించారు. తెలంగాణ లో ముందు జాగ్రత్త చర్యలుగా ఈ కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజా సహకారం కూడా అవసరమన్న ఆయన... తన సినిమా షూటింగ్‌లను తక్షణం ఆపేసి... వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందన్న మెగాస్టార్... మరింత అప్రమత్తత అవసరమన్నారు.  కరినుంచి ఒకరికి వేగంగా సోకే అవకాశం ఉండటంతో కరోనాను చూసి జంకుతున్నారు జనం. ముఖ్యంగా జన సమూహం ఉండే ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అలాంటి ప్రదేశాలపై ఆంక్షలు విధించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొరటాల శివ- చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరోవైపు పవన్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలు సినిమా షూటింగ్స్ వాయిదా వేసుకుంటున్నారు.  టాలీవుడ్ లో పెద్దాయనే తన సినిమా వాయిదా వేసుకున్న నేపథ్యంలో స్టార్ హీరోలు తమ సినిమాలపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపించించిన విషయం తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ తన తాజా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా పూజ హెగ్డే నటిస్తుండగా, కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరు తీసుకున్న నిర్ణయం ప్రజలు మెచ్చే విధంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: