సినీ పరిశ్రమలో వారసులు వచ్చి తమ సత్తా చాటడం ఇప్పుడు కొత్తేమీకాదు. స్టార్ హీరోల కొడుకులు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో సక్సస్ అయ్యారు. ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. ఇక హీరోల కూతుళ్ళు కూడా స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్, శరత్ కుమార్, శ్రీదేవి లాంటి స్టార్స్ కూతుళ్ళు సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. వీళ్ళ ఇన్స్పిరేషన్ తోనే ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్‌ గారాలపట్టి సినిమా ఎంట్రీ ఇస్తోంది.

 

తెలుగులో అర్జున్ త‌న కూతురిని ప‌రిచ‌యం చేయబోతున్నారని తాజా సమాచారం. అందుకు ప్రయ‌త్నాలు కూడా మొదలు పెట్టారట. అర్జున్‌కి తెలుగులో చాలామంది ద‌ర్శకులు, నిర్మాత‌ల‌తో మంచి అనుబంధం ఉంది. దాంతో త‌న కూతురిని పరిచయం చేయమని అడుగుతున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఇందులో భాగంగానే ఐశ్వర్య కూడా హైద‌రాబాద్ వ‌చ్చి కొంత‌మంది ద‌ర్శక నిర్మాతలని క‌లిసిందట. కొన్ని ఫోటో షూట్స్ కూడా జరిగాయని అంటున్నారు. ఇక త్వర‌లోనే ఐశ్వర్య టాలీవుడ్‌లో ఒక యంగ్ హీరో నటించే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందట. 

 

ఇక తాజాగా ఐశ్వర్య .. అర్జున్ విడుదల చేసిన ఫోటోషూట్స్ కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఐశ్వర్య హాట్ ఫోటోషూట్‌ను ప్రస్తుతం టాలీవుడ్‌లోని పీఆర్‌వోలు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికేనట. తెలుగు సినిమా ప్రారంభించడానికి ముందు ఐశ్వర్య అందరి దృష్టిని  ఆకర్షించాలని ప్రయత్నిస్తుందట. అంతేకాదు త్వరలో మరిన్ని ఫోటోషూట్‌లు కూడా వదలబోతున్నారట ఈ తండ్రీ కూతురు.

 

మరి ఐశ్వర్యకు తొలి అవకాశం ఎవరిస్తారో.. ఏ హీరో సరసన హీరోయిన్‌గా పరిచయమవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక అర్జున్ అటు తమిళంలో ఇటు తెలుగు లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్కడు, జెంటిల్ మాన్ వంటి సూపర్ హిట్స్ అర్జున్ సినీ కెరీర్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు అర్జున్ కూతురు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: