బుల్లితెర మీద స్టార్ యాంకర్ అనిపించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. పాపులారిటికి పాపులారిటి డబ్బుకి డబ్బు సంపాదించాడు. చెప్పాలంటే బుల్లితెర మీద షోస్ తోనే క్షణం తీరిక లేకుండా ఒక స్టార్ హీరో రేంజ్ లో బిజీగా ఉన్నాడు. అయినా తేలుకుట్టిన పనులు చేశాడు. అదే హీరో అవ్వాలని కల కనడం. అక్కడే మాచిరాజు తప్పు చేసి కూర్చున్నాడు. తన ముందు వాళ్ళని చూసైనా తెలుసుకోకుండా టెంప్ట్ అయ్యాడు. ఏదో సరదా తీరడానికి సినిమాలలో చిన్నా చితకా పాత్రలు వస్తున్నా కూడా .. లేదు నేను హీరోగా చేయాల్సిందే అంటూ ఇరుక్కుపోయాడు.

 

ప్రదీప్ ఎన్నో ఆశలతో హీరో అవ్వాలన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం బాగానే శ్రమించాడు. తాజాగా ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా?' అన్న సినిమా ఈనెల 25న రిలీజ్ కి అంతా సిద్ధమయింది. ఇంతలోనే ప్రదీప్ లైఫ్ లోకి కరోనా వచ్చింది. అందుకే థియేటర్లను బంద్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 21 వరకూ థియేటర్స్ ని మూసేయాలని నిర్ణయించింది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నది కరోనా కే తెలియాలి.

 

 పాపం ప్రదీప్ తన మొదటి సినిమాని ఎంతో ప్రేమించి చేశాడు. అంతేకాదు యూత్ ని బాగా అట్రాక్ట్ చేయడానికి కాలేజ్ లకు వెళ్లి ప్రచారం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇలా అనుకున్నాడో లేదో..కరోనా ఎఫెక్ట్ తో కాలేజీలు మూసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రదీప్ అనుకొను ఉండడు. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. అయితే చాలామంది మాత్రం ప్రదీప్ సినిమా హీరోగా సూటవుతాడు మరో యంగ్ హీరో టాలీవుడ్ కి వస్తున్నాడు. స్మాల్ స్క్రీన్ ని దడదడలాడించాడు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటడం ఖాయమని ప్రదీప్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. లేట్ గా అయినా లేటెస్ట్ హిట్ అందుకొని అందరికీ షాకిస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: