మెగాస్టార్ చిరంజీవి హీరోగా సాధించిన క్రేజ్, అభిమానుల సంఖ్య తెలిసిందే. హీరోగా చిరంజీవి అధిరోహించని శిఖరం లేదు. తెలుగు సినిమా కలెక్షన్ల స్థాయి పెంచిన హీరోగా చిరంజీవి పేరు మోగిపోయింది. మెగాస్టార్ గా తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అదే చిరంజీవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. పాత్ర చిన్నదా పెద్దదా.. ప్రాధాన్యం ఉందా లేదా అని కాకుండా తనను తాను నిరూపించుకోవటానికి అన్ని రకాల పాత్రలు చేశాడు. ఆ కోవలో చేసినవే విలన్ క్యారెక్టర్లు.

 

 

కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా విలన్ పాత్రలు, విలనిజం ఛాయలుండే పాత్రలు, శాడిజం పాత్రలు కూడా చేశాడు. 47రోజులు సినిమాలో పెళ్లాడిన అర్ధాంగిని హింసించే పాత్రలో చిరంజీవి నటించాడు. ఆ సినిమా చూస్తే చిరీంజీవేనా ఇలాంటి పాత్ర చేసింది అనిపించక మానదు. తాయారమ్మ బంగారయ్య సినిమాలో క్లైమాక్స్ లో నాలుగైదు నిమిషాలు మాత్రమే వచ్చే పాత్రలో చిరంజీవి కనిపిస్తాడు. భార్యను బెల్టుతో కొడుతూ శారీరకంగా హింసించే శాడిస్ట్ పాత్రలో చిరంజీవి నటన ఓ రకంగా క్రూరంగా ఉంటుంది. పున్నమినాగు సినిమాలో చిరంజీవి పాత్ర విలన్ కాకపోయినా ఆ ఛాయలుండే పాత్రలో నటించి మెప్పించాడు. 

 

 

న్యాయంకావాలి సినిమాలో అయితే ప్రేమికుడిగా ప్రేమించిన యువతిని మోసం చేసే పాత్రలో విలనిజం పండించాడు చిరంజీవి. ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన మహిళా ప్రేక్షకులు తిడుతూ ఉత్తరాలు కూడా రాశారట. అంతగా చిరంజీవి విలనిజం పండించాడు. మోసగాడు సినిమాలో శ్రీదేవిని రేప్ చేసే పాత్రలో చిరంజీవి క్రూరత్వం చూడాల్సిందే. ఇలాంటి పాత్రల్లో మెప్పించి ఒక్కో మెట్టూ ఎక్కిన చిరంజీవి తదనంతర కాలంలో హీరోగా రాణించాడు. మెగాస్టార్ గా ఎదిగి ఏకంగా నెంబర్ వన్ హీరోగా స్థిరపడ్డాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: