అక్కినేని నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. నిజ జీవితంలో భార్య భర్తలయినా ఈ జంట ఈ సినిమాలోను భార్యా భర్తలు గా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. మధ్య తరగతి జీవితాలు ఎలా ఉంటాయో వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు ఏ రకంగా ఉంటాయో అందులో నుంచి వచ్చే తగాదాలు ఎలాంటి పరిణామాలని దారితీస్తాయో ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈ దర్శకుడు తెరకెక్కించిన రెండవ సినిమానే మజిలీ. బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడమే కాదు మళ్ళీ మళ్ళీ చైతూ సమంత కలిసి నటించాలనిపించేలా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

 

అంతేకాదు ఈ సినిమా హిట్ అవడంతో సమంత చైతూ దర్శక, రచయితలకి మజిలీ వంటి సినిమాలే చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. అలాంటి కథ ఉంటే చెప్పమని మేకర్స్ ని కోరారు. ఆ ప్రయత్నాలే ఇప్పుడు సాగుతున్నాయి. ఇక సమంత మజిలీ తర్వాత ఓ బేబి సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఆ తర్వాత జాను లో నటించింది. హ్యాట్రిక్ హిట్ దక్కుతుందని అనుకున్న సమంతకి షాక్ తగిలింది. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 ఇక్కడ జాను గా తెరకెక్కి ఫ్లాప్ గా మిగిలింది. అయితే వాస్తవంగా ఈ సినిమాలో నాగ చైతన్య సమంత కలిసి నటించాలని దిల్ రాజు ప్రపోజల్ పెట్టారు. కానీ చైతూ ఒప్పుకోలేదు. సమంత మాత్రం డేర్ చేసి సినిమా చేసింది. ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకుంది.

 

ఇదిలా ఉంటే మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌషిక్ టాలీవుడ్ మీద చాలా ఆశలుపెట్టుకుంది. చైతూ వంటి స్టార్ హీరోతో నటిస్తే టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా సెటిలవుతుందని ఆశలు పెట్టుకుంది. కానీ మజిలీ సినిమానే దివ్యాంశ కి చివరి సినిమా అయింది. పాపం చైతూ  తనకి ఏమాత్రం ఉపయోగపడలేదని ఫీలవుతుందట. మరో సినిమా వస్తే ఈ సారి తన టాలెంట్ మొత్తం చూపించాలనుకుందట. మరి ఈ బ్యూటికి మరో ఛాన్స్ ఇచ్చే మేకర్స్ ఎవరో ..!  

మరింత సమాచారం తెలుసుకోండి: