సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకుడిగా టాలీవుడ్  ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా శివ. అక్కినేని నాగార్జున నటించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్ఠించిందో అందరికీ తెలిసందే. 1990 లో రిలీజైన ఈ సినిమా ఇప్పటి తరానికి ఒక రిఫెరెన్స్ మూవీగా తీసుకోవడం చాలా గొప్ప విషయం. డిఫెరెంట్ సౌండింగ్ తో, గ్రేట్ మ్యూజికల్ హిట్ గా రికార్డులని సాధించింది శివ. ఈ సినిమా నాగార్జున కి ఆల్ టైం హిట్ మూవీగా తన సినీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలవడం విశేషం. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున బ్యాచ్ లో నటించిన స్నేహితులు అందరూ టాలీవుడ్ లో దశాబ్ధాల పాటు స్టార్లుగా వెలిగారు.

 

అయితే ఈ శివ సినిమాలో ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగార్జున పక్కన కనిపించడం చాలా మంది గుర్తు పట్టరు. నాగ్ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో పూరి జగన్నాథ్ శివ హిందీ వెర్షన్ రీమేక్ లో శివ గ్యాంగ్ లో కూడా పూరి ఓ చిన్న పాత్రలో నటించేశారట. ఇక పూరీ తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడు నాగార్జున, తర్వాత నాగ చైతన్య నటించిన ఏం మాయ చేశావే, తారక్ నటించిన టెంపర్ సినిమాలో పూరి కనిపించాడు. 

 

ఆర్జీవీ- మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్లు తమ శిష్యులనే హీరోలుగా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి అవకాశమే శివ సినిమా సమయంలో పూరికి దక్కింది. అయితే పూరి జగన్నాద్ లో హీరో లక్షణాలు బాగానే ఉన్నాయి. ఒకవేళ ఆ రూట్ లో ట్రై చేసి వుంటే ఖచ్చితంగా మాస్ హీరో అయుండెవారు. కానీ దర్శకత్వం, రచన మీద ఉన్న ఆసక్తే పూరి ని హీరో కాకుండా చేసింది. అయితే చాలామంది పూరి ని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా ఈయనలో ఈ షకలు కూడా ఉన్నాయో అంటూ సరాదాగా కామెంట్స్ చేస్తుంటారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: