ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు.  ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు అధ్యక్షులు అధికారులు ఈ వైరస్ గురించి బెదిరి పోతున్నారు. ఏ ఒక్కరు కూడా ఇతర దేశాలకు చెందిన ప్రజలు మా దేశం లోకి రాకూడదని ఎవరికి వారు ప్రధానులు మరియు అధ్యక్షులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం భూమ్మీద మరణం తాండవం చేస్తుందని చెప్పవచ్చు. దీంతో చాలామంది శాస్త్రవేత్తలు ఈ వైరస్ కి విరుగుడు కనిపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఈ వైరస్ దెబ్బకి స్టాక్ మార్కెట్లు మరియు వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కువగా ప్రజలు గ్రూపు గా ఉండే చోటా ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు అన్నీ ప్రజల గుమ్మి గా ఉండే చోటా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో చాలావరకు దేవాలయాలు చర్చిలు మరియు మసీదులు షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి చాలాచోట్ల. ఎటువంటి తరుణంలో ఈ వ్యాధి యొక్క ప్రభావం భారత దేశంలో కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ వైద్య అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వైరస్ యొక్క ప్రభావం ఉండటంతో కెసిఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాల్లో భాగంగా ఈనెలాఖరు వరకూ థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడం సర్వత్రా వేడెక్కిస్తోంది.

 

తాజా సన్నివేశం చూస్తుంటే ఈనెల 25న రిలీజవుతున్న ఐదు సినిమాలపై పంచ్ పడినట్టేనని అర్థమవుతోంది. ఇప్పటికే నానీ - సుధీర్ బాబు `వీ` చిత్రాన్ని వాయిదా వేసినట్టు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఇక వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ తేదీల్ని మార్చే వీలుందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విధంగా థియేటర్లు మూసేస్తే ఇండస్ట్రీకి కోట్లలో భారీ లాస్ వస్తుందని నిర్మాతలు మరియు ఇండస్ట్రీ పెద్దలు కెసిఆర్ నిర్ణయానికి గగ్గోలు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: