టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తాతయ్య ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల నటవారసుడిగా బలరామాయణం సినిమాతో చిన్నప్పుడే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత కొంత కాలానికి పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ తో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్, అక్కడి నుండి మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఆపై వరుసగా నటిస్తున్న సినిమాలతో ఎంతో అద్భుత విజయాలు అందుకుని యంగ్ టైగర్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్, తాను పోషించే పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు అనే చెప్పాలి. 

 

ఇక ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ఆర్ఆర్ఆర్ లో మరొక హీరో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఎన్టీఆర్ మంచితనం గురించి ఎందరో ఇతర నటీనటులు చెప్పినప్పటికీ, ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఛత్రపతి సినిమాలో చేసిన నటుడు శేఖర్ చెప్పిన మాటలు నిజంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అనే చెప్పాలి. ఎన్టీఆర్, పైకి కొంత గంభీరంగా కనపడినప్పటికీ లోపల మాత్రం ఆయన మనసు వెన్న వంటిదని అన్నాడు. 

 

శక్తి సినిమా సమయంలో తనకు యాక్సిడెంట్ అయితే, ఎన్టీఆర్ ఎన్నో విధాలుగా తనకు ధైర్యాన్ని అందించారని, అలానే అన్నిటికంటే ముఖ్యంగా అందరితో ఎంత కలుపుగోలుగా ఉండే ఎన్టీఆర్, సెట్లో ఎవరైనా భోజనం చేయలేదు అని తెలిస్తే చాలు వారిని తిట్టి, అవసరం అయితే కొట్టి అయినా భోజనం చేసేలా చేస్తారని, దేనిమీదైనా అలగవచ్చు కానీ, అన్నం మీద అలగకూడదని, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అయితే వాటిని ఒకరితో మరొకరు పంచుకుంటే తప్పకుండా మన మనసుకు తేలిగ్గా ఉంటుందని ఎప్పుడూ ఎన్టీఆర్ అంటుంటారని శేఖర్ చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: