మెగాస్టార్ చిరంజీవికి అప్రతిహతమైన మాస్ ఇమేజ్ రావడానికి కారణమైన రెండు అంశాలు ఆయన డ్యాన్స్, ఫైట్లే. తన స్పీడ్ తో తెలుగు సినిమా గమనాన్నే మార్చేసిన హీరోగా చిరంజీవికి ఎంతో పేరు వచ్చింది. అదే స్పీడ్ ఫైట్లతో తెలుగులో ఆయన తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అటువంటి చిరంజీవికి తన సినిమాల్లో తనతో పోటీ పడే విలన్ విషయంలో కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారట. సరిజోడీ అయితేనే ఆయన వేగాన్ని తెరపై ప్రెజెంట్ చేయగలనని భావించేవారట.

 

 

ఎనభైల్లో చిరంజీవి స్పీడ్ ఫైట్లకు సరైన్ విలన్ గా పేరు తెచ్చుకున్న నటుడు కన్నడ ప్రభాకర్. తెరపై వీరిద్దరూ తలపడటం చూసిన అభిమానులు, ప్రేక్షకులకు వారిద్దరూ నటులనే విషయం మరచిపోయేవారట. అంత సమ ఉజ్జీలుగా వారు ఫైట్లు చేయడంతో చిరంజీవికి కన్నడ ప్రభాకర్ సరైన విలన్ గా ముద్ర పడిపోయాడు. బిల్లా – రంగా, జ్వాల, పులి – బెబ్బులి, కిరాతకుడు, రోషగాడు, రాక్షసుడు, జేబుదొంగ, పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం.. వంటి ఎన్నో సినిమాల్లో వీరిద్దరి హీరో – విలనిజంతో ప్రేక్షకులను మెప్పించారు. చిరంజీవి సినిమా అంటే విలన్ గా కన్నడ ప్రభాకర్ ఉండాల్సిందే అన్నట్టుగా ఓ దశలో దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులు భావించేవారు. ఫైట్లు కూడా నిజంగా ఇద్దరు యోధుల మధ్య జరిగినట్టు ఉండేవి.

 

 

హీరో స్థాయికి తగ్గ విలనిజం ఉంటేనే సినిమా రక్తి కడుతుంది. ఓ విలన్ ను చూడగానే ప్రేక్షకులకు వీడ్ని హీరో చంపెయ్యాలి అనే విధంగా అనిపించాలి. చిరంజీవి సినిమాల్లో కన్నడ ప్రభాకర్ రోల్ కూడా అలానే డిజైన్ చేసేవారు రచయితలు. దానిని చిరంజీవికన్నడ ప్రభాకర్ ఇద్దరూ కలిసి ఓ స్థాయికి తీసుకెళ్లేవారు. అందుకే ఎనభైల్లో చిరంజీవికి సరైన విలన్ గా కన్నడ ప్రభాకర్ ఫిట్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: