ఏ పాత్ర  పోషించినా  తన త‌ర‌వాతే ఎవ‌రైనా అనేంతలా నటించగలిగే  సత్తా ఉన్న బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్ రాజ్.విలక్షణ నటుడిగా తెలుగు,తమిళ, మళయాళ , కన్నడ సినిమాల్లో పలు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు ప్రకాష్ రాజ్. ఫాదర్ పాత్ర అయినా.. విలన్ అయినా.. అన్న అయినా.. డాన్ అయినా.. ఫ్రైండ్ అయినా.. పోలీస్ ఆఫీసర్ అయినా..ఒక్క పాత్ర అని కాదు..ఏ పాత్ర అయినా సరే అవలీలగా..అలవోకగా వంద కాదు రెండొందల శాతం పూర్తిగా నటించగలిగే విలక్షణ నటుడ మన  ప్రకాష్ రాజ్.

 

 

 

సినీ  రంగంలో  తన  కంటూ ఒక  ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రకాష్ రాజ్ .అన్ని భాషలలో ప్రకాష్ రాజ్ సుపరిచితుడే.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటన గురించి చెప్పేదేముంది. .విలన్ గా ఏ సినిమాలో నటించిన గాని ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఒక్కడు సినిమాలో హీరోగా మహేష్ కు ఎంత పేరు వచ్చిందో విలన్ గా చేసిన ప్రకాష్ రాజ్ కూడా అంతే పేరు వచ్చింది. కొండారెడ్డి బురుజు దగ్గర కొట్టుకునే సీన్ దగ్గర మొదలైన ఈ ఇద్దరి శత్రుత్వం ఆ తర్వాత పోకిరితో పీక్స్ లోకి వెళ్లిపోయింది. తర్వాత బాబీ - సైనికుడు - అర్జున్ లాంటి సినిమాల్లో ప్రకాష్ రాజ్ విలన్ నటించాడు.

 

 

 

మొన్నటికి   మొన్న   వచ్చిన  మహేష్  సినిమాలు అయిన భరత్  అను నేను గాని, సరిలేరు  నీకెవ్వరూ సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. కాని అన్నిటిలోనూ విలన్ పాత్రలే పోషించాడు. ఒక్క మహేష్ బాబుతోనే కాదు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు,రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరి హీరోలతో నటించాడు. ఒక్క సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మాత్రం ప్రిన్స్ అండ్ వెంకటేష్ కి తండ్రిగా మంచితనానికి ప్రతిరూపమైన సాఫ్ట్ రోల్ లో నటించాడు.ఒక్క విలన్ పాత్ర మాత్రమే కాదు అన్ని పాత్రల్లో తన దైన శైలిలో నటనకి జీవం పోస్తాడు.

 

 

 

ఒక భర్త అంటే ఇలా ఉండాలి !తాత ఇలా ఉంటాడు !తండ్రి ఎలా పిల్లల్ని పెంచుతాడు, స్నేహితుడిగా, ఆప్తుడుగా హీరోగా, ప్రతినాయకుడిగా, స్నేహితుడిగా అన్ని పాత్రలలో వొదిగిపోతాడు. డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ గాని అదరగొడతాడు.ఇప్పుడు ప్రకాష్ రాజ్ రాజకీయాలలోకి కూడా రాబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. కొత్త కొత్త మంది ఇండీస్ట్రీ కీ విలన్ గా పరిచయమవుతున్నారు. ఎంతమంది వచ్చిన ప్రకాష్ రాజ్ స్థానం ఆయనకే.. ఎన్ని సార్లు ఎన్ని పాత్రలలో చుసిన ప్రేక్షకులకు విసుకు అనేది ఉండదు.ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాష్ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: