కోట శ్రీనివాసరావు అంటే ఎవరికన్నా భయంతో కూడిన వినయం ఉంటుంది. ఇండస్ట్రీ లో సీనియర్ మోస్ట్ విలన్. ఈయన్ని అందరు కోట అని ముద్దుగా పిలుస్తారు.

 

కోట గారు తెలుగు సినిమా నటుడు.ఆయన పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది. విలనిజంలో రాజసం ఉంటుంది. క్యారెక్టర్లో  మేలిమి పనితనం ఉంటుంది. ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రలు వేసి తనదైన గుర్తింపు తెచ్చుకొని ‘ఉత్తమ విలన్‌’ అనిపించుకున్నారు. అయన  మొదట  ప్రతిఘటన’ సినిమాలో నటించారు.  అయితే ‘ప్రతిఘటన’ సినిమాలో   పోషించిన గుండు కాశయ్య   పాత్ర కోట శ్రీనివాసరావును ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ‘ఆర్టిస్ట్‌కు టైం వస్తే టైమే ఉండదు’ అని కోట చెప్పే మాట ఆయన విషయంలోనే అక్షరాలా రుజువైంది!నటుడిగా కోట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘ప్రతిఘటన’. టి.కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో కోట పండించిన నటన ఆయనకు బాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత టి.కృష్ణ దర్శకత్వంలో చేసిన ‘రేపటిపౌరులు’ కూడా కోటలోని విలనిజాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది.

 

 

కొన్ని సిమిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసారు. కానీ నవ్వించే నటుడిని తీసుకువచ్చి విలన్‌ క్యారెక్టర్‌ ఇస్తే... భయం కలగకపోగా నవ్వొస్తుంది. అయితే దీనికి కోట మినహాయింపు. నిన్నటి సినిమాలో కమెడియన్‌గా తెగ నవ్విస్తారు. మళ్ళా  ఈరోజు వచ్చిన సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపి భయపెట్టించగలరు. విభిన్న  కోణాలున్న ప్రతినాయకుడిగా అలరించారు.  కోట శ్రీనివాసరావు నటనకు తిరుగు లేదు. ఎన్నో చిత్రాల్లో ‘కోటమార్కు’ విలనిజం అద్భుతంగా పండించిన ఘనత ఆయనది. కొన్ని సినిమాలను ఒంటి చేత్తో  నడిపించి విజయాన్ని ఇచ్చిన  ఘనుడు కోట. ఆయన నటించిన ‘శివ’, ‘శత్రువు’, ‘బొబ్బిలిరాజా’, ‘గణేష్’, ‘గాయం’.. చిత్రాల్లో విలన్ గా నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

 

హీరో డైలాగులు కొడితే చప్పట్లు కొట్టడం అనేది సాధారణమే కావచ్చుగానీ, తమ డైలాగులతో కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోగలిగే విలన్‌లలో కోట శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. ‘గణేష్‌’ సినిమాలో హెల్త్‌ మినిస్టర్‌ సాంబశివుడిగా ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.

 

విలనిజంలో అసలు సిసలు ‘స్థానికత’ను తీసుకువచ్చారు కోట.విలన్ గానే కాకుంగా కామెడీ విలన్‌గా సైతం కోట పండించిన నటన ఎందరో నటులకు స్పూర్తిగా నిలిచింది.నటుడిగా కోటలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ‘అహనా పెళ్లంట’. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో.. కోట పిసినారిగా పండించిన నటన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ‘ఒరేయ్ అరగుండు వెధవా’ అంటూ బ్రహ్మానందాన్ని తిట్టే సన్నివేశాలు, ముఖ్యంగా ‘నాకేంటి...మరి నాకేంటి..’ అని కోట నోట పలికే డైలాగులు ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి.కోట గారు అండ్ బాబు మొహన్ కాంబినేషన్ సినిమాలోనే హైలెట్.. వీరిద్దరూ ఉన్నారంటే సందడే సందడి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: