ఒక సినిమా డిస్కషన్ లో ఉన్నప్పుడు అనుకున్న కాస్టింగ్ సెట్స్ మీదకు వెళ్ళాక ఉండే అవకాశాలు కొన్ని సందర్భాల్లో వాళ్లు కాకుండా వేరే వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి టైం లో సినిమా నుండి బయటకు వచ్చిన హీరోయిన్ ఏదో కారణాలు చెప్పి బయటకు వచ్చా అన్నట్టు కాకుండా.. క్రియేటివ్ డిఫరెన్స్ అని చెప్పడం. ఒకలా కథ చెప్పి మరోలా తీస్తుండటం లాంటివి ఆ హీరోయిన్ సినిమా నుండి బయటకు వచ్చే కారణాలు అయ్యాయి. 

 

ఇంతకీ ఏ హీరోయిన్ గురించి ఇదంతా చెప్పేది అనే కదా మీ డౌట్.. ఇంకెవరు సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గురించే.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ నుండి తప్పుకుంటున్నట్టు మెసేజ్ పెట్టింది. మాములుగా సినిమాల్లో హీరోయిన్స్ మారడం కామనే కాబట్టి లైట్ తీసుకోవచ్చు.. కాని క్రియేటివ్ డిఫరెన్స్ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం వార్తలకు తావిస్తుంది. పెద్దగా అవకాశాలు లేని త్రిషసినిమా నుండి క్విట్ అవడంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. 

 

త్రిష తప్పుకోవడం వల్ల చిరు సినిమాకు వచ్చిన నష్టం ఏమి లేదు.. అయితే త్రిష ఇలా సినిమాకు ఓకే చెప్పి తర్వాత తప్పుకుంటే అది సినిమా కు బ్యాడ్ సెంటిమెంట్ అని టాక్. ఇలానే త్రిష కొన్ని తమిళ సినిమాలకు ముందు హీరోయిన్ గా ఓకే చెప్పి ఆ తర్వాత తప్పుకుంది. సామి 2 సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా లో త్రిష ఉందని వార్తలు వచ్చి ఆ తర్వాత ఆమె ప్లేస్ లో కీర్తి సురేష్ వచ్చి చేరింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే త్రిష కాదండి కాబట్టి చిరు ఆచార్య కూడా అలాంటి ఫలితమే అందుకుంటుంది అంటున్నారు. అయితే త్రిష బదులుగా ఆ ప్రాజెక్ట్ కు కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. కొరటాల శివ ఇప్పటి వరకు ప్లాప్ సినిమా తీయలేదు.. ఆచార్య విషయంలో త్రిష సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: