దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి సామెత పాతదే అయినా ఎన్ని కాలాలకు అయినా ఇది అప్లికబుల్ అవుతుంది. స్టార్స్ గా సంపాదించిన డబ్బంతా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టి వాటిని రెట్టింపు చేసే పనిలో ఉన్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఈమధ్య బిజినెస్ లు చేస్తున్నారు. లేటెస్ట్ గా నాని జెర్సీ సినిమా లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ కూడా కొత్తగా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసింది. 

 

హోటల్ బిజినెస్ అందరు చేసేదే ఇందులో వెరైటీ ఏముంది అనుకోవచ్చు.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శ్రద్ధ శ్రీనాథ్ పెట్టింది హోటలే కాని అక్కడ స్పెషల్ గా లిక్విడ్స్ ఎక్కువ దొరుకుతాయట. వచ్చేది సమ్మర్ కాబట్టి దానికి తగినట్టుగా జ్యూస్ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టిందట. ఆ హోటల్ లో జ్యూస్ చాలా రకాలుగా అందుబాటులో ఉంటాయట. సమ్మర్ లో అందరికి కావాల్సిన పౌష్టిక ఆహారాలతో ఈ జ్యూస్ తయారు చేస్తారట. 

 

పర్ సే అనే పేరుతో హోటల్ పెట్టిన శ్రద్ధ శ్రీనాథ్ ఈ బిజినెస్ లో తన సత్తా చాటాలని చూస్తుంది. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉన్నా ఇలా హోటల్ బిజినెస్ పెట్టి రెండు చేతులా సంపాదిస్తుంది. జెర్సీ తో తన యాక్టింగ్ టాలెంట్ చూపించిన శ్రద్ధ శ్రీనాథ్ ఆది జోడిలో నటించినా ఉపయోగం లేకుండా పోయింది. టాలెంట్ తో పాటు తెలివితేటలు కూడా ఉన్న ఈ హీరోయిన్ వేసిన ఈ బిజినెస్ స్టెప్ కూడా సక్సెస్ అయినట్టే అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అమ్మడు తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో తెగ బిజీ అవుతుంది. తనకు ఇచ్చిన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసే అమ్మడు ఇక మీదట కూడా ఇదే ఫామ్ కొనసాగించాలని ఆశిద్దాం. అమ్మడి జోష్ చూస్తుంటే అన్ని భాషల్లో అదరగొట్టేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: