సినిమాలు తెచ్చిన స్టార్డమ్ తో పాలిటిక్స్ లో చక్రం తిప్పిన వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే విజయ్ కు మాత్రం పొలిటికల్ కలర్ తో బోల్డంత కలిసొస్తోంది. అభిమానులు చేసే హంగామాతో సినిమాలు భారీగా వసూల్ చేస్తున్నాయి. ఇప్పుడు మాస్టర్ చుట్టూ అల్లుకున్న రాజకీయం కూడా ఇలాగే సినిమాపై అంచనాలు పెంచుతోంది. 

 

విజయ్ పై జరుగుతోన్న ఐటీ రైడ్స్ తో ఈ హీరో ఫాలోయింగ్ మరింత పెరిగిపోతోంది. నెల క్రితమే ఐటీ రైడ్స్ చేసిన అధికారులు, మళ్లీ గత గురువారం సోదాలు చేయడంతో విజయ్ ఫ్యాన్స్ ఊగిపోయారు. తమ హీరోను కావాలనే టార్గెట్ చేశారని పబ్లిక్ గా విమర్శలు చేశారు. విజయ్ కు మద్దతుగా నిలబడతామని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఐటీ రైడ్స్ లో విజయ్ క్లీన్ గా తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

 

విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. లొకేషన్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే ఫిబ్రవరిలో ఐటీ రైడ్స్ జరిగాయి. బిగిల్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడనే పాయింట్ లో సోదా చేశారు. అప్పుడే విజయ్ ఫ్యాన్స్ కు మద్దతుగా మాస్టర్  షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. 

 

విజయ్ ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నాడు. అతను చెన్నైలో లేని టైమ్ లో ఐటీ రైడ్స్ జరుగడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా దళపతి వచ్చాక అందరికీ సమాధానం చెబుతాం అని మాట్లాడుతున్నారు. అయితే సర్కార్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగులు ఉన్నాయనే వివాదంతో ఈ సిినిమాకు కలెక్షన్లు పెరిగాయి. ఇపుడు ఐటీ రైడ్స్ తో మాస్టర్ కు పబ్లిసిటీ వస్తోందని చెబుతున్నారు. 

 

 



మరింత సమాచారం తెలుసుకోండి: