గతంలో విలన్ అంటే శాడిజం ఉండాలి. లేదా అతనిలో ఒక రౌద్రం ఉండాలి, జనాలను భయపెట్టాలి. కాని ఈ తరం విలన్ అలా కాదు.  విలన్ అంటే వైవిధ్య౦ ఉండాలి. ఏ సీన్ లో అయినా అల్లుకుపోవాలి అతను. అలా అల్లుకుపోయిన వాళ్ళలో సోనూ సూద్ ఒకడు. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో టాప్ విలన్ అయిన వాళ్ళల్లో సోనూ సూద్ ఒకడు. అరుంధతి సినిమాలో అతని నటన హావ భావాలు చూసి ప్రేక్షకులు భయపడ్డారు. ఆ విధంగా అతను నటించి మెప్పించాడు. ఏక్ నిరంజన్ సినిమాలో అతని నటనకు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. 

 

విలన్ పాత్ర ఏ కోణంలో ఉన్నా సరే అతను మాత్రం ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రేక్షకులకు చూపిస్తాడు. జులాయి సినిమాలో అతను మూగ, చెవిటి అమ్మాయికి చేసే సైగలు, తమ్ముడి మీద చూపించే ప్రేమ, కోటా శ్రీనివాసరావు దగ్గర అతని మాటలు, ఆస్తమా పేషెంట్ గా అతను నటించిన విధానం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సినిమాలో అతని నటన ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల పక్కన విలన్ గా చేసాడు. అక్కడ కూడా విలన్ గా ఆకట్టుకున్నాడు. ఏ హీరో పక్కన అయినా సరిపోతాడు అనే విధంగా నటించాడు. 

 

ఆంజనేయులు సినిమాలో అతను ప్రేక్షకులను విలన్ గా నవ్వించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అతని పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకున్నారు ప్రేక్షకులు. అతనికి హీరో రేంజ్ గ్లామర్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలు అతనికి ఫిదా అయిపోయారు. ఆ విధంగా నటించి మెప్పించాడు. ఈ మధ్య అతని హవా తగ్గింది. అతని నవ్వుకి కూడా ఎందరో ఫాన్స్ ఉన్నారు. అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో అరుంధతి, బాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: