ప్రకాష్ రాజ్... ఇండియన్ సినిమాలో ఈ నటుడ్ని వాడుకున్నట్టు బహుశా ఏ నటుడ్ని వాడుకోలేదు ఏమో. కర్ణాటకలో పుట్టిన ఈ నటుడు... దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ సినిమాలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా తమిళ౦ అయినా కన్నడం అయినా ఎక్కడ అయినా సరే అతని నటన అమోఘం. ముఖ్యంగా అతను చేసిన విలన్ పాత్రలు ఇప్పటి వరకు పెద్దగా ఎవరూ చేయలేదు. అన్ని భాషల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు. నటనలో వైవిధ్యం అతని సొంతం. 

 

మహేష్ బాబు సినిమాల్లో అతను చేసిన విలన్ పాత్రలు అలా నిలిచిపోయాయి. పోకిరి సినిమాలో విలన్ గా అతను చేసిన విలన్ పాత్ర టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఓబుల్ రెడ్డి గా ఒక్కడు సినిమాలో మహేష్ బాబు నటన ఎంతో ఆకట్టుకుంది.  ఆ నటనకు టాలీవుడ్ లో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అర్జున్ సినిమాలో అక్క మావగారు పాత్రలో అతను చేసిన నటన అటు ప్రేమను, ఇటు శాడిజం అన్నీ పరిచయం చేసాడు. భార్యను ప్రేమించే భర్తగా ఆ సినిమాలో విలన్ పాత్రను పండించాడు. సరిలేరు నీకవ్వరు సినిమాలో అతను విలన్ గా చేసాడు. 

 

మహేష్ బాబు కి విలన్ గా అతను చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా ప్రభాస్ కి, బాలకృష్ణ కి, జూనియర్ ఎన్టీఆర్ కి అతను విలన్ గా నటించాడు. టెంపర్ సినిమాలో తమ్ముళ్ళను ప్రేమించే అన్నగా అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు. వయసు పైబడినా సరే అతను... నటించే విధానంలో ఏ మాత్రం లోటు పాట్లు ఉండవు. తమిళ సినిమాల్లో అతను చేసే విలన్ పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్ లో కూడా టాప్ విలన్ ఎవరూ అంటే చాలా మంది టక్కున చెప్పే పేరు ప్రకాష్ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: