అల్లు అరవింద్ ‘ఆహా’ పేరుతో ఓటీటీని ప్రారంభించినప్పటికీ ‘ఆహా’ కు ఆశించినంత మైలేజ్ రాకపోవడంతో కొద్దిరోజుల క్రితం అల్లు వారిలో టెన్షన్ మొదలైంది అంటూ వార్తలు వచ్చాయి. దీనితో ‘ఆహా’ ప్రచారంలోకి ఏకంగా అల్లు అర్జున్ ని దింపారు. 

 

అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ కు అలవాటు పడ్డ నేటి యూత్ ‘ఆహా’ వైపు చూస్తారా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేసారు. ఇలాంటి పరిస్థితులలో నిన్న ఎవరు ఊహించని విధంగా కరోనా దెబ్బతో ఏకంగా 15 రోజులు ధియేటర్లు మూత పడటంతో పాటు ఏమ్యూజిమెంట్ పార్క్ లు స్విమింగ్ పూల్స్ జిమ్ లు పబ్ లు బార్ లు మూత పడటంతో యూత్ ఎక్కడకు వెళ్ళాలో తెలియక తెగ తికమక పడిపోతున్నారు. 


కనీసం క్రికెట్ మ్యాచ్ లు కూడ లేకపోవడంతో నిన్న సండే బోరింగ్ డే గా అందరు ఫీల్ అయ్యారు. దీనితో ఏపనీ లేకపోవడంతో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఆహా లకు సబ్ స్క్రైబర్స్ గా నిన్న ఒక్కరోజే వేల సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలలో కొత్త ఖాతా దారులు ఈ సంస్థలకు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. 


దీనితో ఇప్పటి వరకు తన ఆహా గురించి తెగ టెన్షన్ పడుతున్న అరవింద్ కు ఈ ఊహించని పరిణామం జోష్ ను ఇవ్వడమే కాకుండా ఒక విధంగా కరోనా వల్ల వచ్చిన ధియేటర్ల బంద్ అల్లు అరవింద్ కు అదృష్టంగా మారింది అని అంటున్నారు. అందుకే కాబోలు అదృష్టం ఉంటే ఎదో రకంగా కలిసి వస్తుంది అని అంటారు. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ ఊహించని సక్సస్ ను అందుకున్న అరవింద్ కు ఒక విధంగా కరోనా వైరస్ కూడ అదృష్టంగా మారింది అనుకోవాలి. ‘ఆహా’ కు వస్తున్న ఈ ఊహించని స్పందన చూసి అరవింద్ మరింత కంటెంట్ ‘ఆహా’ లో పెంచి అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వాలి అని ఆలోచనలలో ఉన్నట్లు టాక్..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: