డ్రీమ్ గర్ల్ అనగానే ఇండియన్ సినిమాకు హేమమాలిని గుర్తుకొస్తుంది. 70దాటినా అందంగానే ఉందనే ప్రశంసలు అందుకుంటోంది. అలాంటి డ్రీమ్ గర్ల్ ఇమేజ్ ను అందుకోవడానికి ఓ సాదాసీదా హీరోయిన్ పోటీ పడుతోంది. ప్రేమ కథా చిత్రాలతో సౌత్ ఇండియన్ డ్రీమ్ గర్ల్ పదవికి దరఖాస్తు పెడుతోంది సాయిపల్లవి. 

 

సాయిపల్లవి ముంబయి బ్యూటీస్ లా అంత అందంగా ఉండదు. స్కిన్ షోకు చాలా దూరం. కానీ ప్రేమ కథలన్నీ ఈమెనే వెతుక్కుంటూ వస్తున్నాయి. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కు ఫస్ట ఆప్షన్ గా మారుతోంది. హైబ్రిడ్ పిల్ల అంటూ హంగామా చేస్తోన్న ఈ భానుమతితో స్టెప్పులేసేందుకు కుర్రాళ్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ బ్యూటీ సౌత్ డ్రీమ్ గర్ల్ గా మారుతోంది. 

 

సాయి పల్లవి మళయాళీ ప్రేమమ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీలో లెక్చరెర్ మలర్ గా కుర్రాళ్లకు లవ్ లెసన్స్ చెప్పింది. ఈ క్రేజ్ తో టాలీవుడ్ ని ఫిదా చేసేందుకు భానుమతిలా రంగంలోకి దిగింది. తర్వాత పడిపడి లేచె మనసు అంటూ హడావిడి చేసింది. ఇప్పుడు నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ చూపించబోతోంది. 

 

సాయి పల్లవి మళ్లీ శర్వానంద్ తో కలిసి ఓ ప్రేమ కథలో నటించబోతోందట. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వీళ్లిద్దరూ ఓ లవ్ స్టోరీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సో సాయిపల్లవికి వరుసగా లవ్ స్టోరీస్ లో అవకాశాలు రావడంతో, ఈమె సౌత్ డ్రీమ గర్ల్ గా మారుతుందనే టాక్ వస్తోంది.

 

మరి సింపుల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఈ గ్లామర్ తోనే డ్రీమ్ గర్ల్ ఇమేజ్ తెచ్చుకుంటుందా అనేది చూడాలి. మొత్తానికి సాయిపల్లవి కొత్త దనం కోసం తహతహలాడుతోంది. కుర్రకారుకు డ్రీమ్ గాళ్ గా మారేందుకు తహతహలాడుతోంది. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: