తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కొత్త శ్రీనివాస్ రావుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విలన్ గా.. కమెడియన్ గా.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా ఎన్నో రకాల పాత్రలు చేసిన ఆయన రియల్ లైఫ్ లో కూడా కొందరి పాలిట విలన్ గా మారాడు. అదేంటి విలనిజం సినిమాలకే పరిమితం కదా రియల్ లైఫ్ లో అలా ఎలా కొనసాగిస్తారని డౌట్ పడొచ్చు. కోటా విలన్ అయ్యేది మన వాళ్లకు కాదు పరభాషా నటులకు ముఖ్యానంగా అసలు తెలుగు బాషా రాని వాళ్ళను తెచ్చి ఇక్కడ సినిమాల్లో విలన్స్ గా ఛాన్సులు ఇచ్చే డైరక్టర్స్ ప్రొడ్యూసర్స్ ను ఆదుకుంటాడు కోటా. 

 

ఆయన అన్న మాటలకు కొందరు సపోర్ట్ ఇస్తే మరికొందరు మాత్రం మనం వెళ్లి అక్కడ సినిమా చేయట్లేదా అలానే వాళ్ళు కూడా అలానే వచ్చి మన దగ్గర చేస్తున్నారు అని ఆయన్ను విమర్శించే వారు ఉన్నారు అయితే కోటా మాటల ప్రకారం స్టార్ సినిమాల్లో విలన్లను బాలీవుడ్ నుండి పట్టుకొస్తారు. వాళ్లకు ఒకేరకమైన డైలాగ్స్ రాసి ఇస్తారు. వాళ్లకు డైలాగ్ అర్ధం తెలియక అన్ని డైలాగ్స్ కు ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్స్ పెడుతుంటారు. అందుకే వాళ్ళను వద్దంటారు కోటా శ్రీనివాస్ రావు.

 

అక్కడ వాళ్లకు బదులుగా మన దగ్గర ఉన్న నటులను వాడుకోమని చెబుతుంటారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. బాలీవుడ్ నుండి తెస్తున్నాం అని విలన్ల గురించి నానా హంగామా చేయడం తప్ప ఆ సినిమాల్లో మన దగ్గర ఉన్న వాళ్లకు ఛాన్స్ ఇస్తే బెటర్ అంటున్నారు.

 

కోట్లకు కోట్లు ఇచ్చి తెలుగు రాని వారిని తెచ్చి పెట్టడం కన్నా తెలుగు వచ్చి మన దగ్గర ఉన్న నటులను వాడుకోవడం కరెక్ట్ అన్నది కోటా వాదన. అది నిజంగానే మంచి విషయమని చెప్పొచ్చు. కానీ మన వాళ్ళతో పాటుగా బయట ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులను తెలుగులో చేయిస్తే మార్కెట్ ఇంకాస్తఎక్స్ పాండ్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: