కరోనా వైరస్ మహమ్మారికి  ప్రపంచంతో పాటు భారతదేశం కూడ గజగజలాడిపోతోంది. నిన్న ఒక్కరోజులో మన దేశంలో 26 కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 110కి పెరిగి పోయింది. ప్రజల అన్ని కార్యకలాపాలు స్తంభించడంతో ఆలయాలలో భక్తులు తగ్గడమే కాకుండా శుభకార్యాలు పెళ్ళిళ్ళకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి స్వయం నిర్భందంలో ప్రపంచం ఉంది. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి అభిమానులు ప్రపంచాన్ని టార్గెట్ చేస్తూ ఒక విషయమై కామెంట్స్ మొదలుపెట్టారు. కరోనా సమస్య పై పోరాటం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సపోర్ట్ చేస్తూ చిరంజీవి తన ‘ఆచార్య’ షూటింగ్ ను వాయిదా వేసాడు. 


ఇప్పుడు చిరంజీవి పద్ధతిని అనుసరిస్తూ అనేక మంది స్టార్స్ కూడ తమ షూటింగ్ ను రద్దు చేసుకుంటున్నారు. ఇలా సామాజిక స్పృహతో టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా కరోనా పై యుద్ధం చేయడానికి సహకరిస్తూ ఉంటే  ప్రాణాంతక కరోనా ప్రపంచాన్ని కబలిస్తోందని తెలిసినా ఎలాంటి భయం లేకుండా ముక్కుకు మాస్క్ పెట్టుకుని ప్రభాస్ యూరప్ కు వెళ్ళిన ఫోటోలను చూసి చిరంజీవి అభిమానులు ప్రభాస్ కు సామాజిక బాధ్యత లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

అంతేకాదు ప్రభాస్ షూటింగ్ నిర్వహిస్తున్న జార్జియా దేశంలో కూడ కరోనా బాధితులు బయటపడుతున్నారని పైగా అక్కడ వాతావరణం చాలా శీతలంగా ఉండే పరిస్థితులలో షూటింగ్ ను 10 డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద షూట్ చేస్తూ ఉండటం ప్రభాస్ కు ఏమాత్రం మంచిది అంటూ చిరంజీవి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కూల్ ఏరియాల్లో వైరస్ వ్యాప్తి ఇంకా వేగంగా ఉంటుంది అన్నవిషయాలు కూడ ప్రభాస్ కు తెలియవా అంటూ చిరంజీవి అభిమానులు ప్రభాస్ ను కార్నర్ చేస్తున్నారు.


మరికొందరైతే ప్రస్తుతం యూరప్ నుండి ఇండియాకు తిరిగి రావడానికి ఎవరికైనా వీసాలు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో ప్రభాస్ ఇండియాకి ఇప్పట్లో ఎలా వస్తాడు అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. అంతేకాదు విదేశాల నుండి ఇండియాకు వచ్చే భారతీయులు కూడ పరీక్షలు చేసి 14 రోజుల పరిశీలనలో ఉంచుతున్న నేపధ్యంలో సెలెబ్రెటీ హోదాలో ఉన్న ప్రభాస్ కు కూడ ఈ పరీక్షలు తప్పవా అంటూ జోక్ చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: