ఫ్యాక్షన్ సినిమాలకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. దాదాపుగా అగ్ర హీరోలు అందరూ ఫ్యాక్షన్ సినిమాలు చేసారు. రాజకీయ నేపధ్యంలో, ఫ్యాక్షన్ నేపధ్యంలో వచ్చిన సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్ ఇలా అందరూ ఫ్యాక్షన్ సినిమాలు చేసారు. ఇక ఈ సినిమాల్లో విలన్ గా నటించిన ముఖేష్ ఋషీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రాయలసీమ ప్రాంతంలో ఉండే రెడ్ల ఆధిపత్యం అతను చూపించిన విధానం మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. 

 

ఇంద్ర సినిమాలో చిరంజీవి పక్కన అతను చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో టాప్ విలన్ గా ఒక వెలుగు వెలిగాడు ముఖేష్ ఋషీ. అగ్ర హీరోల సినిమాల్లో అతను ఉంటేనే ఒక అందం అని ప్రేక్షకులు అంటారు. సీతయ్య సినిమాలో అతను నటించిన నటనకు టాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా అతని మీసకట్టు, పంచె కట్టు ఇవన్ని కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో ఆ రేంజ్ విలన్ ని మనం చూడలేకపోయాం. ఒక రాజసం చూపించాడు తన నటనలో. 

 

సీతయ్య సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక జల్సా సినిమాలో కూడా అతని నటన ఎంతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో అతను కాస్త స్టైల్ గా కూడా కనిపించాడు. అతను విలన్ గా హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే వాడు అప్పట్లో. చిన్న హీరోల పక్కన అతను నటించే వాడు కాదు. అగ్ర హీరోల సినిమాలు అంటే అతనే విలన్ గా ఉండే వాడు. అతన్ని చూసి రాయలసీమ రెడ్లు తమ ప్రాంతానికి చెందిన రెడ్డి అనుకున్నారు. ఆ విధంగా నటించాడు అతను. ఇప్పుడు అతను కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: