ప్రస్తుతం టాలీవుడ్ లో చందమామలాంటి హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... తెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడికి కెరియర్ కి మంచి బాటలు  పడ్డాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ కూడా దశాబ్దకాలంగా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికీ అటు సీనియర్ హీరోలతో పాటు ఇటు జూనియర్ హీరోల సరసన కూడా నటిస్తూ అందరికీ పోటీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు దశాబ్ద కాలంగా తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళ హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 కెరీర్ మొదట్లో ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ... ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ వస్తోంది. అయితే గ్లామర్ పాత్రలు చేసినా..  నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసిన అభిమానులు మాత్రం ఈ అమ్మడు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన ఈ ముద్దుగుమ్మ తన నార్మల్ లైఫ్ పర్సనల్ లైఫ్ గురించి  పలు విషయాలను పంచుకుంది. తన నిజ జీవితం వేరు... తాను పోషించే పాత్రలు వేరు అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ రెండింటినీ ఎప్పుడూ వేర్వేరుగా చూడడానికి తాను ఇష్టపడతాను అంటూ తెలిపింది. నేను పోషించిన పాత్ర లాగా నిజ జీవితంలో ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. 

 

 

 నాకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది.. నా వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం... నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోను అంటూ చందమామ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం కాజల్ చేతిలో వారు సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విలక్షణ నటుడు కమలహాసన్ తో  భారతీయుడు సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు. అంతేకాకుండా మంచు విష్ణుతో మోసగాళ్లు సినిమాలో నటిస్తోంది. ఇక సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న కొరియర్ రీమేక్ మూవీ లో కూడా కాజల్ పాప నటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: