ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పుని బట్టి సినిమా కథలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఒక ఫార్మేట్ లో వెళ్లే తెలుగు సినిమా కొత్త టాలెంట్ పీపుల్ తో కొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి. సినిమాను ఇలానే తీయాలి అన్న ఒక స్కెల్ ఏమి పెట్టుకోకుండా కొత్తగా  ట్రై చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో హీరోల ఇమేజ్ కు తగినట్టుగా మాస్ అండ్ కమర్షియల్ అంశాలు ఉంచుతూనే కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఇక విలన్ల సంగతి తెలిసిందే. ఈమధ్య టాలీవుడ్ లో విలన్ల పాత్రలు కొత్తగా రాస్తున్నారు దర్శకులు.

 

విలన్ క్యారక్టర్ లో కూడా చాలా మార్పులు తెచ్చారు. విలన్ అంటే ఇలానే ఉండాలి అన్నట్టు కాకుండా స్టయిలిష్ విలన్స్ ను చూపిస్తున్నారు. అంతేకాదు హీరో విలన్ మధ్య ఒక్క ఫైట్ కూడా లేకుండా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇదంతా దర్శకుడి యొక్క ప్రతిభ అని చెప్పొచ్చు. విలన్ అనగానే మాసిన గెడ్డం.. ఎలాగైనా హీరోని పడగొట్టాలన్న ఆలోచనలతో ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలకన్నా హ్యాండ్సమ్ లుక్ తో విలన్లు కనబడుతున్నారు.

 

అంతేకాదు ఎత్తు పై ఎత్తులు హీరోల పాత్రలకు ఏమాత్రం తగ్గకుండా విలన్ క్యారక్టర్ బిల్డప్ ఇస్తున్నారు. తెలుగులో విలన్ పాత్రలకు ఈ చేంజ్ రావడంతో దర్శకుల పాత్ర ఉందని చెప్పొచ్చు. హీరో ఇమేజ్ తగ్గట్టుగా విలన్ పాత్ర రాసుకోవడం ఆ ఇమేజ్ కు తగినట్టుగా బాలీవుడ్ నుండి అయినా తీసుకురావడం జరుగుతుంది. మొత్తానికి దశాబ్ద కాలాలుగా తెలుగు విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న రూల్ మారి కొత్తగా ట్రై చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ కొత్త ఆలోచనలను రిసీవ్ చేసుకుంటున్నారు. సినిమాలో విలన్ అనగానే భారీగా ఊహించేసుకోకుండా లాజిక్ గా ఆలోచించే స్థాయికి సినిమాలు వస్తున్నాయి. ఇదో రకంగా గొప్ప మార్పు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: