కోటా శ్రీనివాసరావు... టాలీవుడ్ చూసిన అరుదైన నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. పాత్ర ఏది అయినా సరే ఆయన అలా ఒదిగిపోయే వారు. ఎందరో నటులకు ఆయన గురువుగా కూడా ఉన్నారు. టాలీవుడ్ లో ఆయనను చూసి నటన నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు అగ్ర హీరోల సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గా మంచి పాత్రలు చేసారు కోటా శ్రీనివాసరావు. యువ హీరో, సీనియర్ హీరో అనే తేడా లేకుండా నటించి మెప్పించారు కోటా శ్రీనివాసరావు. 

 

ఆయన చేసిన విలన్ పాత్రలు వెండి తెర మీద అలా నిలిచిపోయాయి అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఎందరో దర్శకులకు ఆయన విలన్ ఏ విధంగా ఉండాలో చూపించారు. అతడు సినిమాలో కోటా శ్రీనివాసరావు హావ భావాలు చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఒక రాజకీయ నాయకుడిగా విలన్ గా ఆయన ఆ సినిమాలో నటించి మెప్పించారు. అదే విధంగా కోటా చేసిన మంచి సినిమాల్లో... యోగి కూడా ఒకటి. ఆ సినిమాలో ఆయన కనీసం కనికరం, నైతిక విలువలు ఏ మాత్రం లేని వ్యక్తిగా నటించి మెప్పించారు. 

 

మావ గారు సినిమాలో ఆయన కామెడి విలన్ గా నటించారు. ఆ సినిమాలో ఆయన విలన్ గా నటించడం తో పాటుగా కామెడి కూడా పండించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి సినిమాల్లో ఆయన విలన్ గా నటించారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా ఆయన విలన్ పాత్రలు వేసారు. టాలీవుడ్ లో కోటా నటన చాలా మందికి ఆదర్శం అనే చెప్పుకోవాలి. ఏ పాత్ర అయినా సరే ఆయన చేస్తేనే ఒక అందం అనే విధంగా నటించే వారు కోటా.

మరింత సమాచారం తెలుసుకోండి: