నీ దారే కాదు నా దారి కూడా రహదారే. ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో అయినా సరే నేను నిన్ను ద్వేషిస్తూనే ఉంటా. నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి నీ ఇంటి యజమానురాలు.” నరసింహా సినిమాతో ఇండియన్ సినిమాలో లేడీ విలన్ గా కొత్త ఒరవడి సృష్టించారు రమ్యకృష్ణ, నరసింహా సినిమాలో ఆమె నటన ఒక స్థాయిలో ఉందని బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. నీలాంభరి గా ఆమె చేసిన పాత్ర ఆ విధంగా గుర్తుండిపోయింది అందరికి. సాధారణంగా రజని కాంత్ పక్కన నటించడం అంటే అంత సులువు కాదు. 

 

అలాంటిది ఏ మాత్రం భయపడకుండా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆమె నటించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళంలో అయితే రజనీ కాంత్ అభిమానులు ఆమెను అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. ఆమె ఆ సినిమాలో కట్టిన చీరలు కూడా ఎంతో నచ్చేసాయి. నీలాంభరి చీరలు అంటూ అమ్మకాలు కూడా జరిగాయి. క్లైమాక్స్ సీన్ లో ఆమె నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఏ మాత్రం తగ్గలేదు రజని కాంత్ ముందు. హావ భావాలు అన్నీ కూడా ప్రేక్షకులను అలా చూస్తుండి పోయే విధంగా చేసింది అనేది వాస్తవం. 

 

ఆ తర్వాత లేడీ విలన్లకు ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పించింది. టాలీవుడ్ దర్శకులు కూడా రమ్యతో మళ్ళీ అలాంటి పాత్ర ఒకటి చేయించాలి అని చూసినా సాధ్యం కాలేదు. ఆ సినిమాలో గ్లామర్ తో పాటు పొగరు కూడా అదే విధంగా చూపించారు రమ్యకృష్ణ. దర్శకులకు కూడా ఆమె కొత్త పాఠాలు నేర్పించారు. ఆమె కోసమే కథలు రాసుకునే విధంగా నటించి రమ్య. రమ్య కెరీర్ లో ఆ పాత్ర అలా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: