నిన్న తెలుగు సినిమా పితామహుడుగా భావించే రఘుపతి వెంకయ్యనాయుడు 79వ వర్థంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ ఎదురుగా ఉన్న రఘుపతి వెంకయ్య విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆద్వర్యంలో జరిగాయి. 


ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి సంబంధించిన చిన్నచిన్న ఆర్టిస్టులు వచ్చారు కాని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరు హాజరు అవ్వకపోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఇదే సందర్భంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిలిం నగర్ ను రఘుపతి వెంకయ్యనాయుడు ఫిలింనగర్ గా మార్చాలని డిమాండ్ చేసారు. 


అంతేకాదు రఘుపతి వెంకయ్యనాయుడు విగ్రహానికి రంగులు వేసి ఫెన్సింగ్ గొడుగు నిచ్చిన వంటి ఏర్పాట్లు చేసి ఫిలిం నగర్ సెంటర్ లో రఘుపతి వెన్కయ్యనాయుడు విగ్రహానికి ఒక గౌరవాన్ని తీసుకు రావాలి అంటూ చలసాని శ్రీనివాస్ ఒక కొత్త ఉద్యమాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి లాంటి వ్యక్తులు పూనుకుని ఇలాంటి విషయంలో శ్రద్ధపడితే ఫిలిం నగర్ రఘుపతి వెంకయ్యనాయుడు గా మారే ఆస్కారం ఉంది. 


అయితే ప్రస్తుతం మన టాప్ యంగ్ హీరోలకు చాలామందికి రఘుపతి వెంకయ్యనాయుడు చరిత్ర గురించి అస్సలు తెలియని పరిస్థితి. జమిందారి కుటుంబంలో పుట్టి సినిమా లపై ఉన్న మోజుతో ఆనాటి కాలంలో తెలుగు సినిమా సృష్టి కర్తగా రఘుపతి వెంకయ్యనాయుడు చేసిన కృషి కేవలం చరిత్రలో మిగిలిపోయింది కాని ఈనాటి తరం హీరో హీరోయిన్స్ కు కూడ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో చలసాని శ్రీనివాస్ ఇచ్చిన పిలుపును పట్టించుకునే స్థితిలో మన ఇండస్ట్రీ పెద్దలు లేరు అన్నది వాస్తవం. రఘపతి వెంకయ్యనాయుడు జీవితం పై ఒక బయోపిక్ సినిమాలో సీనియర్ నరేశ్ ఎంతో కష్టపడి నటించినా ఆ సినిమా గురించి కనీసం పట్టించుకున్న వ్యక్తులు కూడ లేరు అన్న విషయం అందరు గుర్తించవలసిన వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: