ఒక సినిమాలో హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యమైన విషయం తెలిసిందే. ఎందుకంటే హీరో పాత్ర సినిమాలో ఎంత బలంగా ఉంటే విలన్ పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి. ఈ రెండు పాత్రలు ఏది తక్కువైనా సినిమా కాస్త ప్రేక్షకులకు ఎక్కదు. అందుకే దర్శక నిర్మాతలందరూ స్టార్ హీరోలను సెలెక్ట్ చేయడంలో ఎంత జాగ్రత్త పడతారో ఆ స్టార్ హీరోలను ఢీకొట్టే విలన్ లను ఎంచుకోవడంలో కూడా అంతే జాగ్రత్త పడతారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో.... హీరోలకు మించిన క్రేజ్ విలన్లకు కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు హీరోలకంటే విలన్లకు  మంచిపేరు వస్తూ ఉంటుంది. 

 

 

 అయితే ప్రస్తుతం టాలీవుడ్లో చాలా మంది విలన్లు  ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా విలన్ పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు సాయి కుమార్ సోదరుడు రవిశంకర్. రవిశంకర్ ఇప్పటివరకు ఎన్నో నెగటివ్ పాత్రల్లో  నటించడంతో పాటు ఎన్నో విలన్ పాత్రలో కూడా నటించారు. తనదైన నటనతో ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో కూడా విలన్ పాత్రల్లో  నటించారు. ఇలా తెరమీద కనిపించే విలన్ పాత్రల్లో  ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తెరవెనుక ఉండే విలన్ పాత్రలో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు రవి  శంకర. తెర వెనుక ఉండే విలన్ ఏంటి అంటారా. 

 

 

 అంటే ప్రస్తుతం చాలామంది విలన్లు తెరమీద తమ యాక్షన్ నటనతో అదరగొట్టారు అన్న విషయం తెలిసిందే. ఇక తెరమీద విలన్లు  చేసే నటనకు తగ్గట్టుగా భీకరమైన వాయిస్ తో ... ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ విలన్ లు  అందరికీ డబ్బింగ్ చెబుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సాయికుమార్ సోదరుడు రవిశంకర్. ప్రస్తుతం విలన్ పాత్రలో ఆయన అందించే వాయిస్ కు ఫిదా అవ్వని  తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కేవలం ఒకే రకంగా కాకుండా రకరకాలుగా తన వాయిస్ ని మార్చుతూ విలన్లకు ఇప్పటివరకూ ఎన్నో వందల సినిమాలు డబ్బింగ్ చెప్పారు రవిశంకర్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నటిస్తున్న విలన్ లందరికి  డబ్బింగ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: