గతంలో మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడి పాత్రల్లో నటించిన ఎంతో మంది నటులు అద్భుతమైన విలనిజంని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. సత్యనారాయణ, రావుగోపాల్ రావు, నాగభూషణం, రాజనాల, ప్రభాకర్ రెడ్డి నుండి ప్రకాష్ రాజ్ వరకు అందరూ గొప్ప నటులే. అయితే వీరందరి కంటే అతి ఉత్తమ విలన్ ఎవరని ప్రశ్నిస్తే నిస్సందేహంగా ఎస్వీ రంగారావు అని చెప్పుకోవచ్చు. ఆసక్తికర విషయం ఏమిటంటే... యాక్టింగ్ లో అతి ఎఫెక్టివ్ పద్ధతిని యూస్ చేసుకొని ఎస్వీ రంగారావు నటించేవారు. ఉదాహరణకి ఒక మాంత్రికుడి పాత్ర చేయవలసి వస్తే... తాను కొన్ని రోజులపాటు మాంత్రికుడిగా ఊహించుకుంటారు. చివరికి ఎలాగోలా తానే నిజమైన మాంత్రికుడని తన బ్రెయిన్ ని నమ్మేలా చేస్తారు. ఆ తరువాత ఇక ఆ పాత్రలో ఒదిగిపోయి తన నట విశ్వరూపం ప్రేక్షకులకి చూపిస్తారు.



అందుకే ఏ సినిమాలో చూసుకున్నా అతని నటన చాలా నాచురల్ గా ఉంటుంది. ఇప్పుడు వస్తున్నా విలన్స్ మొత్తం వేరే వాళ్ళ వాయిస్ తోనే పనికానిచేస్తున్నారు. కానీ అప్పట్లో తనకి తాను డబ్బింగ్ చెప్పుకునే వారు ఎస్వీ రంగారావు. 69 ఏళ్ల క్రితం పాతాళభైరవి సినిమాలో నేపాలి మాంత్రికుడిగా నటించిన ఆయన కంటివిరుపు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ 'సాహసం సేయరా, డింభకా! సంకల్పం సిద్ధిస్తుంది. రాజకుమారి లభిస్తుంది', అంటూ ఎన్నో టెర్రిఫిక్ డైలాగులు తన కంచు కంఠంతో చెప్పి నేటితరం వారిని ఇప్పటికీ కట్టిపడేస్తున్నారు.




సినిమా తర్వాత ఆయన మాయాబజార్ లో ఘటోత్కచుడుగా, నర్తనశాల లో కీచకుడుగా, సంపూర్ణ రామాయణంలో రావణాసురుడు గా... ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే భయంకరమైన విలన్ పాత్రల్లో నిండు విగ్రహంతో గంభీరమైన కంఠంతో బ్రహ్మాండంగా నటించారు. భక్త ప్రహల్లాద సినిమాలో హిరణ్యకశిపు పాత్రలో నటించి ఒంటి చేత్తో ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు.

 


1964 ఇండినేషియా లోని జకార్తా లో ఆఫ్రో–ఆసియా ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో 24 దేశాల ఉత్తమ నటుల్ని అవలీలగా ఓడించి అంతర్జాతీయంగా ఉత్తమనటుడు అవార్డుని అందుకున్నారు ఎస్వీ రంగారావు. ఈ సందర్భంలోనే ఇండోనేషియా మాజీ ప్రెసిడెంటు అయిన సుహార్తో నర్తనశాల సినిమాలో ఎస్వీ రంగారావు కీచకపాత్ర లో చాలా బాగా నటించారు అని తెగ కొనియాడారు. ఏదేమైనా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించారు. అందుకే ఆయనకి విగ్రహం కట్టించి మరీ ప్రతి ఏటా పాలాభిషేకం చేస్తారు తెలుగు ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: