సాధారణంగా బుల్లితెర మీద నటించే వారికంటే వెండితెర మీద కనిపించే వారికి ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. వెండితెర మీద కనిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టి అంతటి పాపులారిటీ వస్తుంది. ఇక హీరోగా పది చిత్రాల దాకా చేసిన వారికి ఇంకెలా ఉంటుంది. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. వెండితెర మీద నటించిన వారికి ఎలాంటి పాపులారిటీ వస్తుందో బుల్లితెర మీద నటించిన వారికి కూడా అలాంటి పాపులారిటీని వస్తుంది .

 


కొన్ని సార్లు వెండితెర మీద కనిపించిన వారికంటే ఎక్కువ కూడా ఉంటుంది. తాజాగా జరిగిన ఒక సంఘటనే దీనికి ఉదాహారణగా నిలిచింది. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా వేడుక కరీంనగర్ లో జరిగింది. ఈ వేడుకకి బిగ్ బాస్ విజేత సింగర్  రాహుల్ సిప్లిగంజ్ కూడా వచ్చాడు. అయితే అక్కడ రాహుల్ అభిమానులు గోల గోల చేశారు. బగ్ బాస్ విజేతగ్గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ తో సెల్ఫి దిగడానికి ఎగబడ్డారు.

 

ఒక సినిమా హీరోని పక్కన పెట్టుకుని రాహుల్ తో సెల్ఫీ దిగుతుంటే పక్కన ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి రాజ్ తరుణ్ సైతం రాహులే నా హీరో అని చెప్పుకున్నాడు. ఉయ్యాలా జంపాలా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ తో మంచి విజయం అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తున్నా అవన్నీ ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాయి.

 

 

మొన్నటికి మొన్న వచ్చిన ఇద్దరి లోకం ఒకటే కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పేలవ పరాజయాన్ని చవి చూసింది. దీంతో రాజ్ తరుణ్ పని అయిపోయిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ కొండా దర్శకత్వంలో చేస్తున్న ఒరేయ్ బుజ్జిగా సక్సెస్ అవుతుందనే ఆశతో ఉన్నాడు. ఈ నెల ౨౫న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో  ఏప్రిల్ కి వాయిదా పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: