తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక నాన్న గా ఒక తండ్రిగా ఒక బాబాయిగా ఒక మామగా .. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. విలక్షణమైన నటనకు  కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించి  వరుస అవకాశాలు దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రకాశ్ రాజ్. ఏ  పాత్రలో చేసిన ఆ పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడు అన్న  విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రకాష్  రాజ్  హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఆ తర్వాత ఎన్నో ముఖ్య పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటిస్తూ పాత్రల్లో జీవించి మరి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. 

 

 

 కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు అటు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా తన విలక్షణమైన నటనతో హవా నడిపించారు. అయితే హీరో హీరోయిన్లకు ఒక మంచి తండ్రిగా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే కేవలం నాన్నగా మాత్రమే కాదు ఒక పవర్ఫుల్ విలన్ గా కూడా తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించాడు ప్రకాష్  రాజ్ . అబ్బో ప్రకాష్ రాజు విలనిజానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. దశాబ్దకాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా తన ప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్ గా  కొనసాగించాడు ప్రకాష్  రాజ్ . ఇక కొన్ని కొన్ని సినిమాల్లో కామెడీ విలన్ గా  కూడా చేసాడు . ఇక కొన్ని సినిమాల్లో అయితే ప్రకాష్ రాజ్ విలనిజం  సినిమా చూస్తున్న ప్రేక్షకులు సైతం భయపడేవారు అంటే అర్థం చేసుకోవచ్చు విలన్ గా ప్రకాష్ రాజ్ ఎంత ప్రభావితం చేసాడు. 

 

 

 ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ప్రకాష్ రాజ్. పవర్ఫుల్ విలనిజానికి మారుపేరుగా... స్టార్ హీరోలను ఢీకొట్టే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమాలో మహేష్ బాబుని కొట్టే పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు ప్రకాష్ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: