టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతోమంది బాలీవుడ్ విలన్లు తమ సత్తా చాటారు. బాలీవుడ్ లో నుంచి విలన్లు రావడం ఇప్పుటిది కాదు..పాత తరం నుంచే సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి తో ఎంతో మంది బాలీవుడ్ నుంచి వచ్చిన నటులు తలపడ్డారు. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన విలన్ హీరోలతో సమానంగా స్టైలిష్ లుక్ తో తన విలనీజాన్ని చూపించాడు బాలీవుడ్ నటుడు, మోడల్ రాహూల్ దేవ్. కెరీర్ పరంగా మోడలింగ్ వృత్తిలో ఉన్న రాహూల్ దేవ్ బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తెలుగు తెరపై విలన్ గా తన విశ్వరూపాన్ని చూపించాడు.
టాలీవుడ్ లో మెగాస్టర్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు రాహుల్ దేవ్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2001లో రిలీజ్ మహేష్ బాబు సినిమాలో షకీల్ అనే క్యారెక్టర్‌తో తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో రాహూల్ దేవ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వతా వరుసగా తెలుగు లో ఛాన్సులు దక్కించుకున్నాడు.
నాగార్జున తో మాస్ మూవీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడు, సింహాద్రి, మున్నా, పౌర్ణమి, ఒక్కడున్నాడు, ఎవడు, షాడో, లౌక్యం, జై చిరంజీవి వంటి సినిమాల్లో విలన్ రోల్లో రాహుల్ అదురగొట్టారు. రాహుల్ దేవ్ తర్వాత ఈ తరహాలో చాలా మంది మోడల్స్ విలన్ల అవతారం ఎత్తారు. ప్రస్తుతం తెలుగు లో తక్కువగా నటిస్తున్నా బాలీవుడ్ లో మాత్రం మంచి ఛాన్సులు కొట్టేస్తున్నాడు రాహూల్ దేవ్. మొత్తానికి తెలుగు హీరోలకు ఓ స్టైలిష్ లుక్ తో ఉన్న విలన్ దొరికాడని అప్పట్లో టాక్ నడిచింది.