తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ నటుడు రామిరెడ్డి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దాదాపు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 250 సినిమాల్లో పైగా నటించిన రామిరెడ్డి విలన్ గా మంచి పేరును దక్కించుకున్నాడు. అంకుశం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రామిరెడ్డి ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ, అనగనగా ఒక రోజు, అమ్మోరు తదితర చిత్రాల్లో నటించి తనకంటే ఉత్తమ ప్రతినాయకుడు మరెవరూ ఉండరు అనేలా చేశాడు. కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసి తనలోని నటన వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించాడు. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన సినిమాల్లో రామిరెడ్డి తప్పనిసరిగా ఉండేవాడు.




సినిమాల్లోకి రాకముందు ఉస్మానియా యూనివర్సిటీ లో జర్నలిజం డిగ్రీ పూర్తి చేసుకున్న రామిరెడ్డి హిందీ ఉర్దూ దిన పత్రికలో పాత్రికేయుడిగా పనిచేశారు. అయితే అతను కోడి రామకృష్ణ కంట పడడంతో అంకుశం సినిమాలో విలన్ పాత్రకి తన కరెక్ట్ గా సరిపోతాడని డైరెక్టర్ భావించాడు. ఇక ఆ విధంగా అంకుశం సినిమాలో విలన్ పాత్రను మొట్టమొదటిగా పోషించాడు రామిరెడ్డి. అయితే ఈ చిత్రంలో రామిరెడ్డి చొక్కా చింపేసి కట్ డ్రాయర్ తో అతన్ని హీరో రాజశేఖర్ చార్మినార్ ఎదుట తన్నుకుంటూ తీసుకెళ్తాడు.





విశేషమేమిటంటే... యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ రామిరెడ్డి ని నిజంగానే తన్నాడట. దాంతో రామిరెడ్డి కూడా నిజంగానే కోప్పడి ఎదురుతిరిగడట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు నిజంగానే కొట్టుకున్నారట. అయినా సినీ బృందం వారిని ఆపకుండా ఆ దృశ్యాలను చిత్రీకరించి సినిమాలో చూపించారట. ఈ విషయాలన్నీ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి కూడా. ఏదేమైనా సినిమాల్లోనే వీరి మధ్య విరోధం ఉండేది. రామిరెడ్డి కి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు రాజశేఖర్ తన సొంత డబ్బుతో హాస్పిటల్ బిల్లులను చెల్లించాడని కొంత మంది చెబుతుంటారు. మంచి నటుడు ని తెలుగు ప్రేక్షకులు అతి తక్కువ సమయంలోనే కోల్పోవడం ఎంతో బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: