సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఒక్కప్పుడు టాప్ రేంజ్ లో ఉన్నవారే ఎప్పుడు డౌన్ అయిపోతారో ఎవరికీ తెలీదు. ఒక్కపుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోగా మహిళా ప్రేక్షకాదరణ పొందిన సీనియర్ హీరో జగపతిబాబు. హీరోగా దాదాపు కెరియర్ ఎండింగ్ కి వచ్చేసిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా అవతరించాడు. ఇక ఆ దెబ్బతో జగ్గు భాయ్ దశ తిరిగిపోయింది.తెలుగులోనే కాదు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా జగపతి క్రేజ్ పెరిగిపోయింది.

 

బోయపాటి-బాలయ్య సినిమా లెజెండ్ లో విలన్ గా ప్రవేశం చేసి, అందరినీ ఆకర్షించాడు. లెజెండ్ సినిమాలో బాలయ్యతో పాటుగా పోటీ పడి నటించిన జగపతి బాబు ఆ తర్వాత విలన్ గా మంచి ట్రెండ్ సృష్టించారు.

 

లెజెండ్ తో విలన్ గా మారిన జగ్గు భాయ్ శ్రీమంతుడులో తండ్రి పాత్ర వేశాడు. ఇక నాన్నకు ప్రేమతోలో మరోసారి స్టైలిష్ విలన్ గా చేసి వారెవా అనిపించాడు. అయితే నాన్నకు ప్రేమతోలో యంగ్ టైగర్ తో పోటీ పడి విలనిజం ప్రదర్శించిన జగపతి విలన్ కు న్యూ డెఫినేషన్ నేర్పించాడు. 

 

ఎన్టీఆర్ తో అరవింద సినిమాలో తారక్ తో మరోసారి ఢీ అంటే ఢీ జగ్గు భాయ్ తన విలనిజంలో కొత్త మెళుకువలు తిప్పారు. అటు రంగస్థలం సినిమాలోనూ రామచరణ్ కి గట్టి పొట్టి ఇచ్చారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చేసిన జగపతిబాబు నటనకు జనం ఫిదా అయిపోతున్నారు. ప్రెసిడెంటు పాత్రలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. మన్యం పులి సినిమాలో కూడా మోహన్ లాల్ కి ధీటుగా నిలిచ్చారు.

 

విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులలో మనసులో తనదైన ముద్ర వేసుకున్నారు జగ్గు భాయ్. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన విలనిజాన్ని సరికొత్త రూట్ లో పరిచయం చేస్తున్నాడు ఈ హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: